For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs PBKS: వర్షం కారణంగా ఆర్సీబీ, పంజాబ్ క్వాలిఫయర్ మ్యాచ్ రద్దయితే..?

RCB vs PBKS: పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు నేడు మొదటి క్వాలిఫయర్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు మరో అవకాశం ఉంటుంది. క్వాలిఫయర్-2లో పోటీ పడే అవకాశం ఉంటుంది. పంజాబ్, ఆర్సీబీ జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ వర్షం లేదా మరో కారణం వల్ల అయినా రద్దైతే.. అది ఒక జట్టుపై ప్రభావనాన్ని చూపుతుంది. ఐపీఎల్ 2025 సిరీస్ ప్రణాళిక ప్రకారం జరగలేదు. భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా కొన్ని రోజుల విరామంతో తిరిగి ప్రారంభమైంది. దీని కారణంగా మ్యాచ్ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేయబడ్డాయి.

దీని ప్రకారం ఐపీఎల్ ప్లేఆఫ్స్ రౌండ్‌లోని క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌ల కోసం రిజర్వ్ డే కేటాయించబడలేదు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉంది. దీని ప్రకారం ముల్లన్‌పూర్‌లో జరగనున్న మొదటి క్వాలిఫయర్ వర్షం కారణంగా సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో ముందున్న జట్టును విజేతగా ప్రకటిస్తారు.

IPL 2025 What Happens If RCB vs PBKS Qualifier 1 Is Washed Out

ఈ పరిస్థితిలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తదుపరి ఎలిమినేషన్ మ్యాచ్‌లో ఆడవలసి ఉంటుంది. రేపు(మే 30) జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. అందులో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం కలిగితే గుజరాత్ టైటాన్స్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. రెండో క్వాలిఫయర్ కు చేరుకుంటుంది.

పంజాబ్, బెంగళూరు జట్లు చెరో 19 పాయింట్లను కలిగి ఉన్నప్పటికీ వర్షం పడితే పంజాబ్ కింగ్స్ జట్టుకు లాభం చేకూరుతుంది. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ నికర రన్ రేట్ ఆధారంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నారు. నెట్ రెన్ రేట్ పరంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో ఉంది. కాబట్టి వర్షం జట్టుకు ఎదురుదెబ్బ అవుతుంది. అయితే వాతావరణ నివేదిక ప్రకారం.. ముల్లన్‌పూర్‌లో వర్షం పడే అవకాశం చాలా తక్కువ.

Story first published: Thursday, May 29, 2025, 12:23 [IST]
Other articles published on May 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+