Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: చిక్కుల్లో పడిన టీమిండియా స్టార్.. క్షమాపణ చెప్పాల్సిందే..

IPL 2025: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాటర్లలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు. సెహ్వాగ్ ఒక విధ్వంసక బ్యాటర్‌గా తన ఇమేజ్ ను సృష్టించుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ భారత్ క్రికెట్ కోసం ఎంతగానో కృషి చేశాడు. సెహ్వాగ్ తన రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్‌గా పని చేస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. చలాకీ మాట్లాడతూ... ప్రస్తుతం ఐపీఎల్-2025లో కామెంట్రీ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. కానీ ఇటీవల వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్- లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సమయంలో కామెంట్రీలో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివాదంలో చిక్కుకున్న వీరు!
వీరేంద్ర సెహ్వాగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వీరేంద్ర సెహ్వాగ్ జాట్ కమ్యూనిటి గురించి వివాదాస్పద ప్రకటన చేశాడు. అనంతరం అభిమానులు వీరును సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. "జాట్ కమ్యూనిటీ ప్రజలు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా.. ఇలా చాలా చోట్ల ఉన్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి వాళ్లు మాట్లాడే భాష మారుతోంది.. కానీ వాళ్లు బుర్ర వాడే తీరులో ఏ మాత్రం తేడా లేదు" అంటూ వీరు సెటైర్ వేశాడు. ఈ ప్రకటన ఇచ్చిన తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ నవ్వడం ప్రారంభించారు కానీ సోషల్ మీడియాలోని అభిమానులకు ఆయన ప్రకటన అస్సలు నచ్చలేదు. ఈక్రమంలోనే వీరేంద్ర సెహ్వాగ్ ను అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఓ కులం మొత్తాన్ని ఇలా ఎలా అంటారని.. వీరేంద్ర సెహ్వాగ్ మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలంటూ మండిపడుతున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ క్షమాపణలు చెప్పాలని కామెంట్స్ చేస్తున్నారు.

IPL 2025 Virender Sehwag Jat Community Controversy Fans Demand Apology

వీరేంద్ర సెహ్వాగ్ స్వయంగా జాట్ కమ్యూనిటికి చెందిన వాడే కావడం గమనార్హం. కానీ జాట్స్ గురించి ఆయన చేసిన వివాదాస్పద ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. అభిమానులు వీరేంద్ర సెహ్వాగ్ ను క్షమాపణ చెప్పాలని కామెంట్స్ చేస్తుండగా.. ఒక నెటిజన్ జాట్స్ మీ ఇంట్లోకి ప్రవేశించి మిమ్మల్ని కొడతారని కూడా కామెంట్ చేశాడు.

జాట్ సమాజం నుంచే..
వీరేంద్ర సెహ్వాగ్ కూడా జాట్ సమాజం నుండే వచ్చాడు. ఆయన హర్యానాలో జన్మించారు. సెహ్వాగ్ తన అభిమానులకు "నవాబ్ ఆఫ్ నజాఫ్‌గఢ్" అని కూడా పిలుస్తారు. వీరేంద్ర సెహ్వాగ్ భారత్ తరపున 104 టెస్టులు, 252 వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. సెహ్వాగ్ టెస్టుల్లో 49.3 సగటుతో 8586 పరుగులు చేశాడు. వీరూ రెడ్ బాల్ క్రికెట్‌లో 23 సెంచరీలు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ రెండు ట్రిపుల్ సెంచరీలు కూడా సాధించాడు. వన్డే క్రికెట్‌లో సెహ్వాగ్ 15 సెంచరీలతో 8273 పరుగులు చేశాడు.

Story first published: Thursday, April 10, 2025, 15:50 [IST]
Other articles published on Apr 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+