Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్సీబీ గెలిచినా.. బాధలో కోహ్లీ.. ఏమైందంటే?

IPL 2025 RCB: ఐపీఎల్‌ 2025లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అదిరే ప్రదర్శన చేస్తూ ముందుకెళ్తోంది. తాజాగా పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తీవ్ర ఉత్కంఠగా సాగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ పై 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టాప్ పొజిషన్ కు వెళ్లింది. దీంతో ఆర్సీబీ జట్టుతో పాటు ఆ ఫ్రాంఛైజీ అభిమానులు, కోహ్లీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జట్టు విజయం సాధించాక సంబరాల్లో మునిగితేలారు.

కానీ ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక్కడు మాత్రం జట్టు విజయం సాధించాక నిరాశగా కూర్చున్నాడు. అదేంటి.. సాధారణంగా కోహ్లీ.. అంటేనే దూకుడు. మైదానంలో ఎలాంటి పరిస్థితిలోనైనా అతడు చూపే హై డోస్ ఎనర్జీ.. అభిమానులతో పాటు ఇతర క్రికెటర్లలోనూ మంచి ఉత్సాహం తెప్పిస్తుంది. వికెట్ పడగానే అతడు చేసుకునే సంబరాలు, లేదంటే భారీ స్కోరు, పరుగులు చేయగానే అతడు చేసుకునే సెలబ్రేషన్స్ అభిమానుల్లో ఊపు తెప్పిస్తుంది. అలా అతడు ఆటను ఎంతో ఆస్వాదిస్తూ ఆడుతుంటాడు. మరి అలాంటి విరాట్ ఈ సారి ఎందుకు సైలెంట్ గా ఉండిపోయాడో చాలా మందికి అర్థం కావట్లేదు.

IPL 2025 Virat Kohli not celebrates after RCB victory against CSK amidst Avneet Kaur controversy

జట్టు విజయంతో తోటీ ఆటగాళ్లంతా సంతోషంతో మునిగి తేలుతుంటే, అభిమానులంతా అభినందిస్తుంటే.. విరాట్ మాత్రం ఒక్కడే డగౌట్ లో కామ్ గా, ఏదో బాధతో ఉలుకు పలుకు లేకుండా కూర్చుకున్నట్లు కనిపించింది. ఈ మ్యాచులో హాఫ్ సెంచరీ మార్క్ టచ్ చేసినప్పుడు సైలెంట్ గానే ఉన్నాడు, వికెట్లు పడినప్పుడు కామ్ గానే ఉన్నాడు, పైగా జట్టు విజయం సాధించాక కూడా ఏదో ఆలోచిస్తూనే కూర్చున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.

ఇది చూసిన పలువురు నెటిజన్లు.. ఇందుకు కారణం తాజాగా బాలీవుడ్ భామ్ అవ్‌నీత్‌ కౌర్‌ విషయంలో విరాట్ కోహ్లీని ట్రోల్ చేయడమే అని అంటున్నారు. ఆ ట్రోల్స్, రూమర్స్ విరాట్ లాంటి బలమైన వ్యక్తిని.. మానసికంగా దెబ్బతీశాయంటూ కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ వాటిని మార్చిపోయి, ముందుకు సాగిపోవాలంటూ మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఎట్టకేలకు చివరిగా ఒక్కసారి మాత్రం ఇతర ఆటగాళ్లను కోహ్లీ హగ్ చేసుకుని కాస్త సంతోషంగా కనిపించినట్లు ఒక్క ఫొటో కనిపించింది.

కాగా, అంతకుముందు రోజే.. విరాట్‌ కోహ్లీ ఇన్‌స్టాలో అవ్‌నీత్‌ కౌర్‌ ఫొటోను లైక్‌ చేశాడు..! దీంతో రకరకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత విరాట్ స్వయంగా వివరణ ఇచ్చాడు. అది అనుకోకుండా జరిగిన తప్పిదం అని స్పష్టత ఇచ్చాడు. అయినా కూడా చాలా మంది విరాట్ కోహ్లీ ఆమెతో లింక్ పెడుతూ మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్స్ చేశారు.

Story first published: Sunday, May 4, 2025, 7:48 [IST]
Other articles published on May 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+