రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు గడువు మరో పది రోజులు మాత్రమే. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది. ఇక నిబంధనలకు అనుగుణంగా నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా ఫ్రాంచైజీ దక్కించుకోవచ్చు.
అయితే రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. ఈ నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చే ఆలోచన ఫ్రాంచైజీలకు బీసీసీఐ వదిలేసింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లుగా నిర్ణయించింది.

అక్టోబర్ 31వ తేదీలోపు రిటైన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉండటంతో ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను దాదాపుగా సిద్ధం చేశాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఒక్కరిని మాత్రమే ఇప్పటికి ఖరారు చేసింది. విరాట్ కోహ్లిని మినహా ఎవరిని ఇంకా రిటైన్ చేసుకోవాలని నిర్ణయించుకోలేదు. 2022 మెగావేలానికి ముందు ఆర్సీబీ కోహ్లి (రూ. 15 కోట్లు), మాక్స్‌వెల్ (రూ. 11 కోట్లు), సిరాజ్ (రూ. 7 కోట్లు) అట్టిపెట్టుకుంది. కానీ ఈ సారి ఆటగాళ్ల పేలవ ఫామ్ దృష్ట్యా రిటైన్ చేసుకోవడానికి ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది.
బౌలింగ్ దళాన్ని నడిపిస్తున్న సిరాజ్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. గత రెండు సీజన్లలో అతను 9 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. ఇక మాక్స్‌వెల్ గత సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. కెప్టెన్ డుప్లెసిస్ వయస్సు 40కు చేరింది. రూ.17.50 కోట్లు వెచ్చించి ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడింగ్ చేసుకున్న కామెరూన్ గ్రీన్‌కు శస్త్రచికిత్స కానుంది. గ్రీన్ కనీసం మరో 6 నెలల పాటు ఆటకు దూరంకానున్నాడు.
రజత్ పటిదార్ రాణిస్తున్నప్పటికీ.. ఈ యువ ప్లేయర్‌పై భారీ మొత్తాన్ని వెచ్చించాలని మేనేజ్మెంట్ భావించట్లేదు. దీంతో రిటైన్ లిస్ట్‌ను ఆర్సీబీ ఇంకా సిద్ధం చేయలేదు. వేలంలో ఆర్‌టీఎమ్ కార్డ్‌తో ఆటగాళ్లను తిరిగి దక్కించుకోవాలని, అలాగే కొత్త ఆటగాళ్లతో జట్టును నిర్మించుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించడంతో మరో వికెట్ కీపర్ కోసం అన్వేషించాలని చూస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా నయా సారథిని వెతుకోతుంది. వికెట్ కీపర్-కెప్టెన్ బాధ్యతలను మోయగలిగే లోకల్ బాయ్ కేఎల్ రాహుల్‌పై ఆర్సీబీ కన్నేసింది. అయితే రాహుల్ వేలంలోకి రావడం.. లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో ఉంది.
ఆర్సీబీ రిటైన్ లిస్ట్: విరాట్ కోహ్లి.