Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC VS RCB: మ్యాచు మధ్యలో గొడవపడిన కోహ్లీ-రాహుల్! (వీడియో)

DC VS RCB: మైదానంలో తనను ఎవరైనా కదిలిస్తే విరాట్ కోహ్లీ ఊరుకుంటాడా? వారిని అస్సలు వదలడు. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాడు. రీసెంట్ గా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీపై దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించినప్పుడు కేఎల్ రాహుల్ ఇది నా అడ్డా అంటూ కాంతారా సెలబ్రేషన్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి కోహ్లీ.. తాజాగా దిల్లీ అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా జరిగిన కీలక మ్యాచులో ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ మ్యచులో దిల్లీ క్యాపిటల్స్ పై 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించడంతో కీలకంగా వ్యవహరించాడు.

IPL 2025 Virat Kohli and KL Rahul fight each other in DC vs RCB match Video Viral

గొడవపడ్డ కోహ్లీ-కేఎల్ రాహుల్..
అయితే ఈ పోరులో విరాట్ కోహ్లీ - కేఎల్ రాహుల్ ఆటపరంగానే కాదు.. నిజంగానే మాటల యుద్దానికి దిగారు. ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరిపైకి మరొకరు వెళ్లి గొడవ పడ్డారు! ఇది చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. వాస్తవానికి కేఎల్ రాహుల్ - విరాట్ కోహ్లీ మధ్య ఏం జరిగిందో స్పష్టంగా తెలీదు కానీ.. ఒకరినొకరు చేయి చూపించుకుంటూ మాట్లాడుకున్నారు. మైక్ లో రికార్డ్ అయిన వారి మాటాలు అర్థం కాలేదు కానీ... ఏదో అంపైర్ ఇచ్చిన నిర్ణయంపైనే ఇద్దరూ సీరియస్ గా డిష్కసన్ చేసుకున్నట్లు అర్థమవుతోంది. కానీ కోహ్లీ ఎక్కువ సేపు రాహుల్ తో వాదించలేదు. ఛేదనలో ఉండడంతో తానే వెనక్కి తగ్గి.. క్రీజు దగ్గరికి వెళ్లిపోయాడు కోహ్లీ. బ్యాటింగ్ పై దృష్టి పెచ్చాడు. రాహుల్ కూడా అసహనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను 'మైదానంలో మాటల యుద్ధం' అంటూ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.

కాగా, ఈ మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లింది. ప్లే ఆఫ్స్‌కు మరింత దగ్గరైంది. మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఆ జట్టులో కేఎల్‌ రాహుల్‌ (41) టాప్ ‌స్కోరర్‌ గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ.. 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కృనాల్‌ పాండ్య (47 బంతుల్లో 73*; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లీ (47 బంతుల్లో 51; 4 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. దిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీకి ఇది ఏడో విజయం కావడం విశేషం.

Story first published: Monday, April 28, 2025, 5:31 [IST]
Other articles published on Apr 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+