For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్యాట్స్ ఉపయోగించుకోవడంలో మోసం?.. సమాచారం లీక్ ..అలెర్ట్ అయిన అంపైర్లు..!

ఐపీఎల్ 2025 సిరీస్‌లోని గత మూడు మ్యాచ్‌లలో అంపైర్లు ఏదో ఒక వింత చేస్తూనే ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఐపీఎల్ సీజన్‌లో అంపైర్లు ప్లేయర్ల బ్యాట్లను తనిఖీ చేశారు. ఆదివారం జరిగిన ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్, ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లలో ఈ ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరుగుతున్నప్పుడు అంపైర్ మ్యాచ్ ను ఆపి ఇద్దరు ఆటగాళ్ల బ్యాట్లను తనిఖీ చేశాడు. ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్ లో అంపైర్లు ఫిల్ సాల్ట్, షిమ్రాన్ హెట్మెయర్ బ్యాట్లను పరిశీలించారు. హెట్మెయర్ బ్యాటింగ్ కు వచ్చిన వెంటనే అంపైర్ ఆటను ఆపి బ్యాట్ గేజ్ ను ఉపయోగించి హెట్మెయర్ బ్యాట్ ను తనిఖీ చేశారు. హెట్మెయర్ బ్యాట్ అధికారిక ఐపీఎల్ మార్గదర్శకాలకు సరిపోతుందో లేదో పరిశీలించారు.

అనంతరం జరిగిన ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో అంపైర్ అకస్మాత్తుగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాను పరిశీలించిన సంఘటన క్రికెట్ అభిమానులలో చర్చకు దారి తీసింది. హార్దిక్ బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు అంపైర్లు పాండ్యా బ్యాట్ సైజు ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఉందో లేదో తనిఖీ చేశారు. బ్యాట్ ను కొలిచేందుకు ఓ పరికరాన్ని ఉపయోగించారు. అయితే హార్దిక్ పాండ్యా బ్యాట్ అనుమతించబడిన పరిణామం 25 అంగుళాల లోపే ఉంది. ఈ బ్యాట్లను పరిశీలించేందుకు అంపైర్ ఒక గేజ్ ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపై ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

IPL 2025 Umpires Inspect Player Bats Amid Suspicions of Illegal Modifications

బ్యాట్లను తనిఖీ చేస్తున్న అంపైరు.. దీనికి ఏమైనా కారణం ఉందా?
రూల్స్ ప్రకారం.. బ్యాట్ పరిమాణం ఒక నిర్దిష్ట పరిమితిని మించి ఉంటే అతనికి కొంత శిక్ష విధించబడవచ్చు లేదా బ్యాట్‌ను జప్తు చేయవచ్చు. కానీ అంపైర్లు ఇప్పుడు ఐపీఎల్ సిరీస్ లో వివిధ ఆటగాళ్ల బ్యాట్లను ఎందుకు పరిశీలిస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. దీని వల్ల కొన్ని ఐపీఎల్ జట్ల నుంచి ఫిర్యాదులు వచ్చి ఉండవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. మరింత దూకుడుగా పరుగులు సాధించడానికి బ్యాట్ బరువు పెంచాల్సిన అవసరం ఉన్నందున.. ఓ ఆటగాడు లేదు జట్టు బ్యాట్ సైజును మార్చి ఉండవచ్చనే సందేహాలు తలెత్తినట్లు సమాచారం.

బరువైన బ్యాట్ తో ఆడితే సులభం సిక్సులు కొట్టవచ్చని ఓ నమ్మకం ఉంది. బ్యాట్ ను పట్టుకోవడం కష్టంగా అనిపించినప్పటికీ టీ20 మ్యాచ్ లలో సగటున 30 లేదా 40 బంతులు ఎదుర్కొంటే దూకుడుగా ఉండే బ్యాటర్ బరువైన బ్యాట్ తో ఆడటం సాధ్యమే. దీని ప్రకారం కొంతమంది ఆటగాళ్లు బ్యాట్ పరిమాణాన్ని మార్చి దూకుడుగా ఆడుతున్నారని ఎవరైనా ఫిర్యాదు చేసి ఉండవచ్చనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రతి మ్యాచ్‌లో అందరి బ్యాటర్ల బ్యాట్లను పరీక్షించడంపై అంపైర్లు అంత శ్రద్ధ చూపలేరు కాబట్టి ఇది ముందు జాగ్రత్త పరీక్ష అని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

సాధారణంగా బ్యాట్ సైజు గురించి నియమాలు ఏం చెబుతున్నాయంటే.. ఐపీఎల్ ప్లేయింగ్ కండీషన్స్‌లోని నియమం 5.7 ప్రకారం ఈ తనిఖీ నిర్వహించారు. దీని ప్రకారం బ్యాట్ల సైజులు నిబంధనలకు అనుకూలంగా ఉండాలి. బ్యాట్ మొత్తం పొడవు, హ్యాండిల్ తో సహా 38 అంగుళాలు ఉండాలి. బ్యాట్ వెడల్పు 4.25 అంగళాలు, 2.64 అంగుళాల మందం, అంచులు 5.56 అంగుళాలు మించకూడదు. అదనంగా హ్యాండిల్ బ్యాట్ మొత్తం పొడవులో 52 శాతం మించకూడదు. ఇక బ్యాట్ అధికారిక బ్యాట్ గేజ్ గుండా అడ్డంకులు లేకుండా వెళ్లడం అవసరం. బ్యాట్ ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వారికి ప్రత్యక్ష జరిమానా విధించబడదు. నియమాలను పాటించకపోతే ఆటగాళ్లు తమ బ్యాట్లను మార్చుకోవాలి.. ఈ ఉల్లంఘనలకు నిరంతరం పాల్పడితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Story first published: Tuesday, April 15, 2025, 12:22 [IST]
Other articles published on Apr 15, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+