Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Retention List: బంగారు బాతును వదిలేస్తున్న కావ్య మారన్!

రిటైన్ ప్లేయర్ల లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. గురువారం లోపు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్. ఆరుగురిని రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్‌తో వేలంలో సొంతం చేసుకోవచ్చు.

నేరుగా రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు ఆయా ఫ్రాంచైజీలు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను అట్టిపెట్టుకుంటే మాత్రం రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీలు అన్ని దాదాపుగా తమ రిటైన్ లిస్ట్‌ను ఖరారు చేశాయి.

IPL 2025 Top Teams Eye Washington Sundar as SRH Set to Release All-Rounder

సన్‌రైజర్స్ హైదరాబాద్ ముగ్గరుని నేరుగా రిటైన్ చేసుకొని, మరో ఇద్దరు ఆటగాళ్లను ఆర్‌టీఎమ్ ద్వారా దక్కించుకోవాలని నిర్ణయించుకుంది. రిటైన్డ్ ప్లేయర్లకు నిర్ణీత ధర కంటే ఎక్కువగా ఎస్‌ఆర్‌హెచ్ సీఈవో కావ్య మారన్ ఆఫర్ చేసిందని సమాచారం. హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ తమ మొదటి మూడు ప్రాధాన్యత ప్లేయర్లుగా ఖరారు చేసింది. ఈ ముగ్గురికి వరుసగా రూ.23 కోట్లు, రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించనుందని తెలుస్తోంది.

ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిని ఆర్‌టీఎమ్‌తో దక్కించుకోవాలని చూస్తోంది. అయిదుగురు క్లాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్ ఉండటంతో కీలక ప్లేయర్లు నటరాజన్, వాషింగ్టన్ సుందర్‌లను వదులుకోవాలని నిర్ణయించుకుంది. అయితే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టులో సుందర్ సంచలన ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆల్‌రౌండర్‌గా తానెంతటి విలువైన ప్లేయరో చాటిచెప్పాడు.

అయితే సుందర్ కోసం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. వేలంలో పెద్దమొత్తాన్ని వెచ్చించి సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. మరోవైపు సుందర్ బంగారు బాతు అని తెలిసినా రిటెన్షన్ నిబంధనల కారణంగా వదులుకోవాల్సిన పరిస్థితి కావ్య మారన్‌కు ఏర్పడింది.

Story first published: Wednesday, October 30, 2024, 11:20 [IST]
Other articles published on Oct 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+