For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: వేలంలో భారీ ధర పలికే టాప్-5 వికెట్ కీపర్లు వీళ్లే!

ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్‌ను నిర్వహించనున్నారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభం కానుంది. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందినే షార్ట్ లిస్ట్ చేసింది.

వాళ్లలో మొత్తంగా 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్లలో 366 మంది భారత ఆటగాళ్లు, 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే వికెట్ కీపర్లు వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వికెట్ల వెనుక గ్లవ్స్‌తో సత్తాచాటడమే కాకుండా బ్యాటుతో విధ్వంసం నెలకొల్పే వికెట్ కీపర్లపై ఫ్రాంచైజీలు రూ.కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెగా వేలంలో భారీ డిమాండ్ పలకనున్న టాప్-5 వికెట్ కీపర్లు గురించి ఓ లుక్ వేద్దాం..!

IPL 2025 Top 5 wicketkeeper-batters Expected to Command the Highest Bids in Mega Auction

రిషభ్ పంత్
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు వేలంలో రికార్డు ధర పలికే అవకాశం ఉంది. వికెట్ల వెనుక చురుకుగా ఉండటమే కాకుండా గేమ్ ఛేంజర్ ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం పంత్ సొంతం. అంతేగాక సారథిగా సత్తాచాటగలడు. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా 2023 సీజన్ మినహా.. మిగిలిన అన్ని సీజన్లలో ఢిల్లీకే ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో 35.31 సగటుతో, 148.93 స్ట్రైక్‌రేటుతో 3284 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్‌కు గాయమవ్వడంతో 2021 నుంచి ఢిల్లీ జట్టు సారథి బాధ్యతలు గత సీజన్ వరకు మోశాడు.

కేఎల్ రాహుల్
2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వికెట్ కీపర్ కేఎల్ రాహుల్.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. గత మూడు సీజన్లలో లక్నోను సారథిగా రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరాడు. గత ఏడు సీజన్లలో ఆరు సార్లు 500+ స్కోరు సాధించి ఐపీఎల్‌లో అత్యంత నిలకడైన బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. ఓపెనర్‌గానే కాకుండా ఏ స్థానంలో అయినా సత్తాచాటే సామర్థ్యం రాహుల్ సొంతం. ఇక నాయకత్వ నైపుణ్యాలు అతని అదనపు బలం.

ఇషాన్ కిషన్
2016లో గుజరాత్ లయన్స్ తరఫున ఐపీఎల్ ప్రాతినిథ్యం వహించిన ఇషాన్ కిషన్ విధ్వంసకర ఓపెనర్-వికెట్ కీపర్‌గా సత్తాచాటాడు. ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గత మెగా వేలంలో రూ.15.25 కోట్లతో రికార్డు ధర పలికాడు. కానీ 2024 సీజన్‌లో 320 పరుగులే చేసిన ఇషాన్‌ను ముంబై వదులుకుంది. ఐపీఎల్‌లో ఓవరాల్‌గా 105 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ కిషన్ 28.53 సగటు, 135.87 స్ట్రైక్‌రేటుతో 2644 పరుగులు చేశాడు.

జోస్ బట్లర్
ఇంగ్లండ్ వైట్ బాల్ టీమ్ కెప్టెన్ జోస్ బట్లర్ 2016 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. 2022 సీజన్‌‌లో 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత సీజన్ నుంచి క్రమంగా బట్లర్ పరుగుల ప్రవాహం తీవ్రత తగ్గింది. ఈ నేపథ్యంలో 34 ఏళ్ల బట్లర్‌ను రాజస్థాన్ రాయల్స్ వదులుకుంది. అయితే తన విధ్వంసంతో మ్యాచ్ స్వరూపాన్ని, సారథిగా జట్టు విజయాల్లో సత్తా చాటే సామర్థ్యం ఉన్న బట్లర్‌కు వేలంలో భారీ డిమాండ్ నెలకొంది.

ఫిలిప్ సాల్ట్
ఇంగ్లండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 2023 నుంచి ఐపీఎల్‌ ఆడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన అతను గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. అయితే కేకేఆర్ తరఫున ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఊచకోతకు దిగాడు. గత సీజన్‌లో 39.55 సగటు, 182.01 స్ట్రైక్‌రేటుతో 435 పరుగులు చేశాడు. అయినా సాల్ట్‌‌ను కేకేఆర్ వదులుకుంది.

Story first published: Wednesday, November 20, 2024, 11:07 [IST]
Other articles published on Nov 20, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+