Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: క్రేజ్ కా బాప్.. కోహ్లీ, రోహిత్‌ను బీట్ చేసిన ధోనీ!!

ఐపీఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్‌ క్రేజ్ గురించి అంతకన్నా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లంతా ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే జాతీయ జట్టు కన్నా ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇచ్చే ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఐపీఎల్ క్రేజ్ అలాంటిది మరి.

అయితే ఐపీఎల్ అనగానే.. సగటు క్రికెట్ అభిమానికి గుర్తొచ్చే పేరు ధోనీ, కోహ్లీ, రోహిత్. ఎంత మంది బడా ప్లేయర్లు ఉన్నా ఈ ముగ్గురు పేర్లే ముందుగా అందరికీ గుర్తొస్తుంది. అంతలా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప, ఎవరికీ క్రేజ్ ఎక్కువ అనే చర్చ కూడా ఫ్యాన్స్ లో తరచుగా నడుస్తుంటుంది.

ఈ చర్చ ఇలా నడుస్తూ ఉండగా.. తాజాగా మార్చి నెలలో ఏ ఐపీఎల్ క్రికెటర్ గురించి సోషల్ మీడియాలో అభిమానులు ఎక్కువగా చర్చించారో అన్న జాబితా ఒకటి విడుదలైంది. అందులో ఇండియన్ క్రికెట్ ఐకాన్ ధోనీ టాప్ పొజిషన్ లో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ కు మహీ దూరమైనప్పటికీ, ఐపీఎల్ లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. తన అసాధారణమైన వ్యూహాత్మక నైపుణ్యాలతో సీఎస్కే జట్టులో కొనసాగుతున్నాడు. క్రికెట్‌తో పాటు బిజినెస్, లైఫ్ ఈవెంట్స్, ఇంకా బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లు అంటూ తరచుగా కనపడుతూనే ఉంటాడు.

IPL 2025 Top 5 Most talked IPL players in march is MS dhoni Kohli Rohit Hardik and Head

ధోనీ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ చార్మింగ్ స్టైల్ తో పాటు బ్యాటింగ్, డైనమిక్ లీడర్ షిప్ క్వాలిటీస్ అతడిని ఈ టాప్ పొజిషన్ లో నిలిపాయి. ఇంకా అతడి ఎండోర్స్మెంట్ డీల్స్, ఫిట్నెస్ కూడా కోహ్లీ గురించి అభిమానులు చర్చించుకునేలా చేస్తున్నాయి.

రోహిత్ శర్మ.. కోహ్లీ తర్వాతి స్థానం సంపాదించుకున్నాడు. అతడు ఇప్పుడు టీమిండియాకు సారథ్యం వహించడంతో పాటు ఐపీఎల్ జట్టులో కొనసాగుతున్నాడు. ముంబయి ఇండియన్స్ లో ప్రధాన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. తన షార్ప్ అండ్ స్ట్రాటజిక్ మైండ్ తో ఎప్పుడూ చర్చల్లో నిలుస్తుంటాడు హిట్ మ్యాన్. ఆ తర్వాతి స్థానాల్లో హార్దిక్ పాండ్య, ట్రావిస్ హెడ్ నిలిచారు. మొత్తంగా ఈ జాబితాలో అన్ని రంగాలలో ఉన్న వ్యక్తులో టాప్ -5లో ధోనీ, కోహ్లీ, ప్రధాన మంత్రి మోదీ, రోహిత్ శర్మ, పవన్ కల్యాణ్ (టాలీవుడ్ యాక్టర్) నిలిచారు.

Story first published: Wednesday, April 2, 2025, 17:08 [IST]
Other articles published on Apr 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+