Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: వేలంలో భారీ డిమాండ్ పలికే టాప్-5 విదేశీ ప్లేయర్లు వీళ్లే!

ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మెగా వేలంలో ఏఏ ఆటగాళ్లను సొంతం చేసుకోవాలని ఫ్రాంచైజీలు కసరత్తులు మొదలుపెట్టాయి. టీమిండియా స్టార్ క్రికెటర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లపై పలు ఫ్రాంచైజీలు కన్నేశాయి. వాళ్ల కోసం రూ.కోట్లు వెచ్చించడానికి సిద్ధమయ్యాయి.

అయితే భారత స్లార్ ప్లేయర్లతో పాటు కొందరు విదేశీ ప్లేయర్లపై భారీ డిమాండ్ నెలకొంది. మెగా వేలంలో వాళ్లపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మినహా మిగిలిన ఫ్రాంచైజీలకీ స్టార్ విదేశీ ఆటగాళ్లు అత్యావశక్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఏఏ ఫారెన్ ప్లేయర్లు రికార్డు ధర పలకునున్నారో ఓ లుక్ వేద్దాం!!

IPL 2025 Top 5 Foreign Players Expected to Command the Highest Bids in Mega Auction

జోస్ బట్లర్
ఇంగ్లండ్ వైట్ బాల్ టీమ్ కెప్టెన్ జోస్ బట్లర్ 2016 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. 2022 సీజన్‌‌లో 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత సీజన్ నుంచి క్రమంగా బట్లర్ పరుగుల ప్రవాహం తీవ్రత తగ్గింది. ఈ నేపథ్యంలో 34 ఏళ్ల బట్లర్‌ను రాజస్థాన్ రాయల్స్ వదులుకుంది. తన విధ్వంసంతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చే సత్తా ఉన్న బట్లర్‌కు వేలంలో భారీ డిమాండ్ నెలకొంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో బట్లర్ దూకుడైన బ్యాటింగ్‌తో మరింత ఆకర్షణగా నిలిచాడు.

ఫిలిప్ సాల్ట్
ఇంగ్లండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 2023 నుంచి ఐపీఎల్‌ ఆడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన అతను గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. అయితే కేకేఆర్ తరఫున ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఊచకోతకు దిగాడు. గత సీజన్‌లో 39.55 సగటు, 182.01 స్ట్రైక్‌రేటుతో 435 పరుగులు చేశాడు. అయినా సాల్ట్‌‌ను కేకేఆర్ వదులుకుంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇటీవల ఫిలిప్ సాల్ట్ శతకంతో కదంతొక్కాడు.

గెరాల్డ్ కొయెట్జీ
2023 వన్డే ప్రపంచకప్‌లో అందరి దృష్టి ఆకర్షించిన దక్షిణాఫ్రికా యువ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కొయెట్జీని ముంబై ఇండియన్స్ రూ.5 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ అత అరంగేట్ర సీజన్ ఐపీఎల్-2024‌లో కొయెట్జీ అంచనాలను అందుకోలేకపోయాడు. 10 మ్యాచ్‌ల్లో 13 వికెట్లే తీశాడు. 10కి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ముంబై అతన్ని రిలీజ్ చేసింది. అయితే కొయెట్జీ ఇటీవల ఎంతో మెరుగయ్యాడు. బంతితో పాటు బ్యాటుతోనూ సత్తాచాటుతున్నాడు.

మిచెల్ స్టార్క్
ఆస్ట్రేలియా స్టార్క్ బౌలర్ మరోసారి రికార్డు ధర పలికే అవకాశం ఉంది. గత మినీ వేలంలో స్టార్క్ రూ.24.75 కోట్లతో రికార్డు ధర పలికిన సంగతి తెలిసిందే. అతన్ని డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ సొంతం చేసుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత గత సీజన్‌లో ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చిన స్టార్క్ కీలక మ్యాచ్‌ల్లో తానెంతటి విలువైన ప్లేయరో నిరూపించాడు. సీజన్ ఆద్యంతం సత్తాచాటకపోయినా ప్లేఆఫ్స్, ఫైనల్స్‌లో నిప్పులు చెరిగాడు. అయితే కేకేఆర్ స్టార్క్‌ను వదిలేయడంతో.. మరోసారి స్టార్క్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడటానికి సిద్ధమయ్యాయి.

కగిసో రబాడ
దక్షిణాఫ్రికా సంచలన బౌలర్ కగిసో రబాడ 2017లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌కు వచ్చిన తర్వాత రబాడ అద్భుత ప్రదర్శన చేశాడు. 2019లో 25 వికెట్లు పడగొట్టిన రబాడ 2020లో 30 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. అనంతరం పంజాబ్ కింగ్స్‌కు వెళ్లిన రబాడ క్రమంగా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. అయితే ఇటీవల నిలకడైన ప్రదర్శన చేయనప్పటికీ రబాడకు వేలంలో భారీ ధర పలికే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Monday, November 11, 2024, 16:12 [IST]
Other articles published on Nov 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+