Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఈ సీజన్‌లో చెత్త స్ట్రైక్ రేట్ ఉన్న టాప్-5 బ్యాటర్లు వీరే..

IPL 2025:టీ20 అంటే సిక్సర్లు, ఫోర్లతో కూడిన ఆట. ఒక బ్యాటర్ ఎన్ని ఎక్కువ సిక్సర్లు, ఫోర్లు కొడితే అంత గొప్ప టీ20 ఆటగాడిగా పరిగణించబడతాడు. ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు ఇలాంటి బ్యాటర్లను వేలంలో కొనుగోలు చేస్తాయి. నెమ్మదిగా ఆడే దాదాపు అందరు బ్యాటర్లు అమ్ముడుపోలేదు. అయితే ఐపీఎల్ 2025లో లాంగ్ సిక్సర్లు కొట్టినా కానీ ఇబ్బంది పడుతున్న అలాంటి ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసి చెత్త స్టైక్ రేట్ కలిగి ఉన్న ఐదుగురు బ్యాటర్ల గురించి తెలుసుకుందాం.

రాహుల్ త్రిపాఠి-96.49 స్ట్రైక్ రేట్
ఐపీఎల్ 2025లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసి బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి అత్యంత చెత్త స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. రాహుల్ త్రిపాఠి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో రాహుల్ త్రిపాఠి 100 కంటే తక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. 5 మ్యాచ్‌ల్లో రాహుల్ త్రిపాఠి 96.49 స్ట్రైక్ రేట్‌తో 55 పరుగులు చేశాడు.

IPL 2025 Top 5 Batters with the Worst Strike Rate This Season

రిషబ్ పంత్ -104.04
ఐపీఎల్ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు కూడా రిషబ్ పంత్ కావడం గమనార్హం. కానీ ఈ సీజన్ లో రిషబ్ పంత్ బ్యాట్‌తో అంతగా రాణించలేదు. 7 మ్యాచ్‌లలో 6 ఇన్నింగ్స్‌లలో రిషబ్ పంత్ 104.04 స్ట్రైక్ రేట్ తో 103 పరుగులు చేశాడు.

విల్ జాక్స్-110
గత సీజన్‌లో ఆర్సీబీ తరపున విల్ జాక్స్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. కానీ ఈ సీజన్ లో విల్ జాక్స్ బ్యాట్ తో అంతగా రాణించలేకపోయాడు. విల్ జాక్స్ 5 మ్యాచ్‌ల్లో 13.75 సగటుతో 55 పరుగులు చేశాడు. విల్ జాక్స్ 110 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేశాడు. టీ20 అతని స్ట్రైక్ రేట్ 155 కావడం గమనార్హం.

రవీంద్ర జడేజా -115
చెన్నై సూపర్ కింగ్స్ తరపున రవీంద్ర జడేజా ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు. కానీ ఈ సీజన్‌లో రవీంద్ర జడేజా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. రవీంద్ర జడేజా 7 మ్యాచ్‌లలో 92 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటివరకు రవీంద్ర జడేజా బ్యాట్ నుంచి 5 ఫోర్లు, 3 సిక్సర్లు మాత్రమే వచ్చాయి.

నితీష్ కుమార్ రెడ్డి -119.14
నితీష్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్ లో నితీష్ కుమార్ రెడ్డి అంత ప్రత్యేకంగా రాణించలేకపోయాడు. 119.14 స్ట్రైక్ రేట్ తో 50 కి పైగా పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Story first published: Wednesday, April 16, 2025, 19:01 [IST]
Other articles published on Apr 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+