Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL ప్లేయర్స్ బీ అలర్ట్ - ఇకపై ఆ ఐసీసీ రూల్స్ అమలు

ఐపీఎల్ - 2025 సీజన్‌ నుంచి కొత్త కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కానుంది. ఇకపై ఐపీఎల్.. ఐసీసీ ప్రవర్తన నియమావళిని అనుసరించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. అంటే మార్చి 21 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ తాజా సీజన్‌లో.. నిబంధనలను ఉల్లంఘించిన ప్లేయర్స్ కు అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాల మేరకు చర్యలు తీసుకోనున్నారు.

''ఇక నుంచి ఐపీఎల్‌లో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ (ప్రవర్తన నియమావళి)ను అమలు చేయనున్నాం. అంటే ఈ ఐపీఎల్ సీజన్ నుంచి ఐసీసీ నియమాలను అతిక్రమించిన ప్లేయర్స్ కు జరిమానాలు విధిస్తాం. లెవల్ 1, 2, 3ను ఉల్లంఘించిన వారికి పెనాల్టీలు వేస్తాం. ఇప్పటి వరకు ఐపీఎల్ తన సొంత కోడ్ ఆఫ్ కండక్ట్‌ ప్రకారం నడుచుకుంది. కానీ ఇకపై ఐపీఎల్ మ్యాచ్‌లు... ఐసీసీ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం కొనసాగుతాయి." అని ఐసీసీ జీసీ మెంబర్ తో ఓ ఐపీఎల్‌ పాలకవర్గ సభ్యుడు చెప్పాడు.

IPL 2025 to follow ICC s Code of Conduct regulations

ఇకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌కు సంబంధించి ప్రారంభ, ఆఖరి మ్యాచ్ తేదీలను అధికారికంగా ప్రకటించారు. మార్చి 21వ తేదీ నుంచి ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుందని తెలిపారు. మే 25వ తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌తో ఐపీఎల్ షెడ్యూల్ క్లాష్ అవ్వకూడదనన్న ఉద్దేశ్యంతోనే.. బీసీసీఐ ఈ సారి ముందుగా మ్యాచ్ తేదీలను ప్రకటించిందని తెలిసింది.

ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికంగా
కాగా, ఇటీవలే ఐపీఎల్ మెగా వేలం దుబాయ్ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో భారత ప్లేయర్లు రిషభ్ పంత్, శ్రేయాుస్ అయ్యర్‌లు భారీ ధరకు అమ్ముడుపోయారు. రిషభ్‌ పంత్‌ (రూ. 27 కోట్లు) ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర పలకిన ఆటగాడిగా నిలవగా.. ఆ తర్వాత స్థానాల్లో శ్రేయస్‌ అయ్యర్‌ (రూ.26.75 కోట్లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ. 23.75 కోట్లు) నిలిచారు.

Story first published: Monday, January 13, 2025, 9:59 [IST]
Other articles published on Jan 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+