Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆర్సీబీదే: షేన్ వాట్సన్

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంటుందని షేన్ వాట్సన్ పేర్కొన్నారు. ఐపీఎల్ ఫైనల్‌‌లో విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుంటాడని మాజీ ఆర్సీబీ ఆల్‌రౌండర్ అంచనా వేశాడు. ఐపీఎల్ లీగ్ దశ ముగింపులో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ 9 మ్యాచ్‌లను గెలవగా.. 4 ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన లీగ్ దశ చివరి మ్యాచ్‌లో రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని ఆర్సీబీ జట్టు 228 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. అద్భుతమైన ఘనతను సాధించింది.

మే 29న, గురువారం ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ జట్టుపై ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 14.1 ఓవర్లలోనే 101 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం 10 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో 9 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆర్‌సీబీ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. గతంలో 2009, 2011, 2016లో ఫైనల్ చేరిన ఆర్‌సీబీ తృటిలో టైటిల్ చేజార్చుకుంది.

IPL 2025 This Time the Title Belongs to RCB Says Shane Watson

ఈ మ్యాచ్ విజయానికి ముందే షేన్ వాట్సన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆర్సీబీ ఐపీఎల్ 2025 టైటిల్‌ను గెలుస్తుందని తాను అనుకుంటున్నట్లు వాట్సన్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుంటాడని తాను భావిస్తున్నానన్నాడు. ఖచ్చితంగా ఈ సారి ఆర్సీబీ టైటిల్ సాధిస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు. జోష్ హేజిల్‌వుడ్ అద్భుతంగా రాణిస్తుండడంతో ఈ ఏడాది ఆర్సీబీదేనని తాను భావిస్తున్నానని షేన్ వాట్సన్ అన్నాడు.

Story first published: Friday, May 30, 2025, 11:11 [IST]
Other articles published on May 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+