Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ బయోపిక్‌లో సౌత్ హీరో - పండగ చేసుకుంటోన్న ఫ్యాన్స్!

Virat Kohli Biopic: భారత క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీది ప్రత్యేక స్థానం. సచిన్, ధోనీ తర్వాత ఆ స్థాయి గొప్ప ఆటగాడిగా, నాయకుడిగా, ప్రేక్షకాభిమానం ఉన్న క్రికెటర్ గా నిలిచాడు. అయితే క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ స్థాయికి ఎదిగిన క్రికెటర్ల బయోపిక్ రావడం సహజమే. ఇప్పటికే సచిన్ డాక్యుమెంటరీ, ధోనీ గురించి సినిమా వచ్చి ప్రేక్షకుల్ని అలరించాయి. దాదా బయోపిక్ కూడా ఆన్ ది వే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు విరాట్ కోహ్లీ బయోపిక్ కూడా సిద్ధం అవుతున్నట్లు కొత్త ప్రచారం మొదలైంది. అయితే ఇందులో ఓ సౌత్ హీరో నటించబోతున్నట్లు అంతా అనుకుంటున్నారు. ఇంతకీ అతడెవరంటే

విరాట్ కోహ్లీ రీసెంట్ గా తనకు ఇష్టమైన కరెంట్ ఫేవరెట్ సాంగ్ గురించి తెలిపాడు. 'నీ సింగం దాన్‌' అనే పాటను బాగా వింటున్నానని చెప్పుకొచ్చాడు. ఇది తమిళ స్టార్ హీరో శింబు నటించిన 'పత్తు థాలా' సినిమాలోనిది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆర్సీబీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అయితే ఇది కాస్త శింబు దృష్టికి వచ్చింది. దీంతో ఆ పోస్ట్‌ను రీ షేర్‌ చేసిన శింబు.. కోహ్లీని ఉద్దేశిస్తూ.. ''నువ్వు నిజంగానే సింహానివి'' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇది చూసిన కోహ్లీ అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు.

IPL 2025 Tamil Star Hero Simbu acting in Virat Kohli s biopic news goes viral

కోహ్లీ బయోపిక్‌లో ఆ హీరో!
ఈ క్రమంలోనే ఇప్పుడు విరాట్‌ కోహ్లీ బయోపిక్‌ ప్రచారం తెరపైకి వచ్చింది. శింబు - కోహ్లీ సంభాషణలు వైరల్ అవ్వడంతో.. ముంబై మీడియాలో కొత్త చర్చ మొదలైంది. కోహ్లీ‌ పాత్రలో శింబు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పైగా శింబు.. ఇప్పటికే కోహ్లీలా గడ్డం పెంచుకోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది.

గతంలోనూ కోహ్లీ బయోపిక్‌లో నటించాలనుందని పలువురు హీరోలు తమ మనసులో మాటను బయటపెట్టారు. బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ తనకు కోహ్లీ పాత్రలో నటించాలనుందని అన్నాడు. టాలీవుడ్‌ హీరో అక్కినేని అఖిల్‌ కూడా ఓ సందర్భంలో తనకు ఈ బయోపిక్‌లో నటించాలనుందని చెప్పుకొచ్చాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో, కోహ్లీ బయోపిక్ లో ఎవరు నటిస్తారో..

Story first published: Saturday, May 3, 2025, 9:07 [IST]
Other articles published on May 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+