Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ముంబయి ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్

IPL 2025 Mumbai Indians Captain: ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తొలి మ్యాచ్‌కు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా దూరం కానున్న సంగతి తెలిసిందే. దీంతో అందరూ రోహిత్ శర్మ కెప్టెన్సీ వహిస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు తొలి మ్యాచ్ కు కొత్త సారథిని ఎంపిక చేశారు. తాజాగా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. కొత్త సారథిని ప్రకటించాడు. సీఎస్కేతో జరగబోయే తమ తొలి మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ జట్టును ముందుండి నడిపిస్తాడని అనౌన్స్ మెంట్ చేశాడు.

ముగ్గురు కెప్టెన్లతో ఆడుతున్నా..
"నేను అదృష్టవంతుడిని. ముగ్గురు కెప్టెన్లతో ఆడుతున్నాను. రోహిత్, సూర్యకుమార్, బుమ్రా. వారెప్పుడు నాకు మద్దతుగా నిలుస్తారు." అని హార్దిక్ పాండ్య అఫీషియల్ గా చెప్పాడు. దీంతో మొదటి మ్యాచ్ కు కెప్టెన్ గా ఎంపికైన సూర్య కుమార్ యాదవ్ కు ముంబయి ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు.

IPL 2025 Suryakumar Yadav will lead Mumbai indians vs CSK announced Hardik pandya

హార్దిక్ పై నిషేధం..
సీఎస్కేతో జరగనున్న తొలి మ్యాచ్ కు హార్దిక్ పాండ్యపై నిషేధం పడింది. అయితే ఈ నిషేధం గత సీజన్‌లోనే విధించారు. ఎందుకంటే గత సీజన్ లో ముంబై ఇండియన్స్‌ మూడుసార్లు స్లో ఓవర్‌ రేట్‌ ఆడింది. అందుకే నిబంధనల ప్రకారం ఆ జట్టు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యకు రూ. 30 లక్షల జరిమానా విధించడంతో పాటు ఓ మ్యాచ్‌ లో ఆడకుండా బ్యాన్ విధించారు. అదే సమయంలో ముంబయి జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. దీంతో హార్దిక్ పై మ్యాచ్‌ నిషేధం విధించడం కుదరలేదు. ఈ కారణంగా ఇప్పుడు ఈ సీజన్‌లో మార్చి 23న చెన్నైలో ముంబయి ఆడే తొలి మ్యాచ్ లో హార్దిక్ ను బ్యాన్ చేశారు. దీంతో సీఎస్కేతో మ్యాచ్ లో పాండ్యాకు బదులుగా సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ అధికారికంగా ప్రకటించారు.

Story first published: Wednesday, March 19, 2025, 12:53 [IST]
Other articles published on Mar 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+