MI vs PBKS: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ముంబై తరఫున సూర్యకుమార్ యాదవ్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 57 పరుగులు చేసి ముంబై జట్టును మంచి స్థాయిలో నిలబెట్టాడు. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(27), రోహిత్ శర్మ(24) పరవాలేదనిపించారు. హార్దిక్ పాండ్యా(26), నమన్ ధీర్(20), విల్ జాక్స్(17) పరుగులు చేశారు. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(1) దారుణంగా నిరాశపరిచాడు. బంజాబ్ కింగ్స్ బౌలర్లలో మార్కో యాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. హర్ ప్రీత్ బ్రార్ ఒక వికెట్ తీశాడు.
చరిత్రను సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఐపీఎల్‌లో రెండు సీజన్లలో 600, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ముంబై ఇండియన్స్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలిసారి 605 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. ఈ సీజన్‌లో కూడా 600 పరుగుల మైలురాయిని దాటాడు. ముంబై ఇండియన్స్ చరిత్రలో సూర్యకుమార్ యాదవ్ కాకుండా సచిన్ టెండూల్కర్ మాత్రమే ఓ సారి 600 కంటే ఎక్కువ పరుగులు స్కోర్ చేశాడు.

ఐపీఎల్ సీజన్‌లో ముంబై తరఫున అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లు వీరే..
619* -సూర్యకుమార్ యాదవ్(2025)
618-సచిన్ టెండూల్కర్(2010)
605 - సూర్యకుమార్ యాదవ్(2023)
553 - సచిన్ టెండూల్కర్(2011)
540 - లెండిల్ సిమన్స్(2015)
538 - రోహిత్ శర్మ(2013)