Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: యమా రంజుగా.. ఈ 4 మ్యాచులే ఫుల్ కిక్!

IPL 2025: ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 32 మ్యాచులు ముగిశాయి. అంచనాలు లేని జట్లు విజృంభిస్తుంటే.. భారీ అంచనాలతో బరిలోకి దిగిన జట్లు తుస్సు మనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో కొన్ని రసవత్తరంగా సాగగా.. మరికొన్ని అంతకుమించి థ్రిల్లింగ్ ను అభిమానులు పంచాయి. మరికొన్ని సప్పగా జరిగాయి. అలానే సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ముగిసిన మ్యాచుల్లో ఫుల్ కిక్ ఇచ్చిన సందర్భాల్లో ఏంటో ఓ సారి నెమరువేసుకుందాం..

మూడు బంతుల్లో.. మూడు రనౌట్లు..
రెండు ఓవర్లలో 23 పరుగులు చేస్తే చాలు.. విజయం దిల్లీదే. అలాంటి సమయంలో వరుసగా మూడు బంతుల్లో మూడు రనౌట్లు అవ్వడంతో దిల్లీ కొంపముంచి ముంబయి ఇండియన్స్ గెలిచింది. మ్యాచును మరింత రంజుగా మార్చింది. ఈ మ్యాచ్ అభిమానులకు మస్త్ మజానిచ్చింది.


ఉఫ్ అని ఊదేస్తుందనుకుంటే...
ఐపీఎల్ 2025లో మొదటగా కిక్కిచ్చిన మ్యాచ్.. పంజాబ్‌ కింగ్స్‌ - కోల్‌కతా నైట్‌రైడర్స్‌.ఈ మ్యాచులో 111 పరుగులే స్కోరు చేసి.. మళ్లీ ఆ మ్యాచ్‌ను కాపాడుకోవడం పంజాబ్‌ కింగ్స్ కు దక్కింది. లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్, పేసర్‌ యాన్సెన్‌ తమ బంతితో మాయ చేయడంతో పంజాబ్ ఈ విజయాన్ని అందుకుంది. వాస్తవానికి 112 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ఉఫ్ అని ఊదేస్తుందని అంతా అనుకుంటే.. అంచనాలు తారుమరయ్యాయి. పంజాబ్ బంతి మాయ చేసింది. దీంతో లక్ష్య ఛేదనలో 95 పరుగులకే కోల్‌కతా కుప్పకూలింది. తద్వారా లీగ్‌ చరిత్రలో అత్యంత స్వల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా పంజాజ్‌ కింగ్స్ నిలిచింది.

ధోనీ అదరహో..
చెన్నై సూపర్‌ కింగ్స్‌ -లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచులో విజయం దోబూచులాడుతూ చివరికి చెన్నై గూటికి చేరింది. దాదాపు ఓడిపోయే మ్యాచులో ధోనీ.. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి తన జట్టును గెలిపించుకున్నాడు. ధోనీ ఇన్నింగ్స్ కు మరోసారి క్రికెట్ అభిమానులంతా ఆశ్చర్యపోయారు. వాస్తవానికి మహీ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులు అయిపోయింది.

సూపర్.. సూపర్‌
నాలుగేళ్ల తర్వాత మళ్లీ సూపర్‌ ఓవర్‌ రుచి చూపించింది దిల్లీ క్యాపిటల్స్‌ - రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్. అభిమానులను ఉర్రూతలూగించింది.ఓడిపోతుందనుకున్న మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ పుంజుకున్న తీరు సూపరో సూపర్. పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ తన ప్రదర్శనతో మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌కు తిప్పాడు. సూపర్‌ ఓవర్‌లోనూ అద్భుతంగా బౌలింగ్‌ చేసి.. జట్టుకు విజయాన్ని అందించాడు. మొత్తంగా ఇప్పటివరకు జరిగిన 32 మ్యాచుల్లో ఈ నాలుగు మ్యాచులు ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాయి.

IPL 2025 super over and lowest score defending thrilling matches details
Story first published: Thursday, April 17, 2025, 18:27 [IST]
Other articles published on Apr 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+