Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kavya Maran: కావ్య మారన్ బాయ్ ఫ్రెండ్..!!

Sunrisers Hyderabad Kavya Maran Boyfriend : సోషల్ మీడియా సెన్సేషన్, ఎంతో మంది కుర్రాళ్ల కలల రాణి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) యజమాని కావ్య మారన్‌. వేలం పాట నుంచి మొదలు.. మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా తన జట్టుతో వెన్నంటి ఉంటూ వాళ్లను ప్రోత్సాహిస్తుంటుంది. జట్టు ఓడినా, గెలిచినా చప్పట్లతో మద్దతు తెలుపుతుంటుంది. ప్రతీ మ్యాచులోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. అదే సమయంలో సగటు ప్రేక్షకుడి లానే తను కూడా జట్టు గెలిస్తే ఉత్సాహంతో చెలరేగిపోవడం, ఓడిపోతే ఉసూరుమనడం చేస్తుంటుంది. పైగా ఆమె అందగత్తే, అందుకే ఈ అమ్మడి ప్రతీ భావోద్వేగాన్ని జూమ్‌ చేసి మరీ కెమెరాలు బంధిస్తుంటారు కెమెరామెన్లు. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కు క్రికెట్ అభిమానులు ఫిదా కూడా అయిపోతుంటారు. ఇంకా చెప్పాలంటే కావ్య మారన్‌ కోసమే మ్యాచ్ చూసేవాళ్లు చాలా మందే ఉన్నారు. అందుకే సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను కుర్ర అభిమానులు తెగ షేర్ చేస్తూ కామెంట్లు చేస్తుంటారు.

ఇదే సమయంలో కావ్య మారన్ బాయ్ ఫ్రెండ్ ఎవరు?, ఎవరితో డేటింగ్ చేస్తుంది? ఆమె లవ్ లైఫ్ గురించి కూడా చర్చ అభిమానుల్లో జరుగుతుంటుంది. తాజాగా మరోసారి ఇదే చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఆమెను ఇప్పటివరకు పలువురు ఫేమస్ పర్సనాలిటీస్ తో లింక్ పెట్టారు నెటిజన్లు. అందులో ఒకడు తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరూధ్ రవిచందర్. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన అతడు.. కావ్యతో డేటింగ్ చేసినట్లు, ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వీటిని అనిరూధ్ టీమ్.. కొట్టిపారేసింది. ఈ ఇద్దరు మంచి స్నేహితులని క్లారిటీ ఇచ్చింది.

IPL 2025 Sunrisers Hyderabad Owner Kavya Maran Boyfriends From Rishabh Pant To Anirudh Ravichander

ఐపీఎల్ 2023లో ఓ మ్యాచ్ సందర్భంగా కావ్యమారన్.. ప్రస్తుత లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఇద్దరూ పక్కపక్కనే కలిసి కూర్చున్నారు. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు చాలా రూమర్స్ వచ్చాయి. వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలోనూ వైరల్ చేస్తూ ఇద్దరికి లింక్ కలిపేశారు పలువురు అభిమానులు. అయితే ఈ విషయంపై పంత్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. వీరిద్దరి మధ్య స్పెషల్ బాండ్ ఉందని స్పష్టత ఇచ్చినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు ఉన్నయి.

ఇకపోతే కావ్య మారన్.. తన జట్టు ఆటగాడైన అభిషేక్ శర్మను ఇష్టపడుతున్నట్లుగా ప్రచారం సాగింది. ఎందుకంటే అతడు ఆడేటప్పుడు.. కావ్య పాప ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే అభిషేక్ - కావ్యది ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ అని, అంతకుమించి ఇద్దరి మధ్య ఇంకేమీ లేదని క్రికెట్ వర్గాలు తెలిపాయి.

Story first published: Friday, March 28, 2025, 11:20 [IST]
Other articles published on Mar 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+