Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: అతడిది పాస్.. ఇతడిది ఫెయిల్..!

ఐపీఎల్ 2025లో క్రికెటర్లు వినియోగిస్తోన్న బ్యాట్లపై తనిఖీ జరుగుతోన్న సంగతి తెలిసిందే. గత మూడు నాలుగు మ్యాచుల నుంచి అంపైర్లు.. ప్లేయర్ల బ్యాట్లను చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వర్సెస్ పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్ ముందు కూడా ఈ టెస్టులు నిర్వహించారు. అయితే ఈ మ్యాచులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

ఆ ఇద్దరి బ్యాట్లు ఫెయిల్..
అంపైర్లు.. సునీల్‌ నరైన్‌ , నోకియా బ్యాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ ఈ పరీక్షలో సునీల్‌ నరైన్‌, నోకియా బ్యాట్లు ఫెయిల్ అయ్యాయి. వారి బ్యాట్ల మందం ఎక్కువగా ఉన్నట్లు టెస్టుల్లో తేలింది. దీంతో అంపైర్లు ఆ బ్యాట్లను పక్కనపెట్టాలని సూచించారు. ఆ బ్యాట్లతో మ్యాచ్ బరిలోకి దిగేందుకు ఆడటానికి పర్మిషన్ ఇవ్వలేదు.

IPL 2025 Sunil Narine Anrich Nortje bats fails in PBKS VS KKR Match

అతడిది పాస్.. ఇతడిది ఫెయిల్..
ముందుగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌, రఘువంశీ బ్యాట్లను రిజర్వ్‌ అంపైర్‌ సయ్యద్‌ ఖలీద్‌ చెక్ చేశాడు. ఆ సమయంలో మందం ఎక్కువగా ఉండటం వల్ల సునీల్ నరైన్ బ్యాట్ పరీక్షలో విఫలమైంది. కానీ రఘువంశీ బ్యాట్‌ మాత్రం టెస్టుల్లో పాసైంది. దీంతో అంపైర్.. సునీల్ నరైన్‌ను మరో బ్యాట్‌తో ఆడమని సూచించాడు.

ఇక మ్యాచు మధ్యలో 16వ ఓవర్లో నోకియా బ్యాటింగ్‌కు రాగా, అప్పుడు ఫీల్డ్ అంపైర్లు మోహిత్‌ కృష్ణదాస్‌, సాయిదర్శన్‌ కుమార్‌.. అతడి బ్యాటింగ్ ను పరీక్షించారు. కానీ ఇందులో నోకియా బ్యాట్ విఫలమైంది. దీంతో స‌బ్‌సిట్యూట్ రహ్మనుల్లా గుర్బజ్.. కొన్ని బ్యాట్లను పట్టుకొని మైదానంలోకి వచ్చాడు. అందులో నుంచి ఓ బ్యాటును ఉన్న అతడు ఎంచుకున్నాడు. కానీ దాంతో అతడు సరిగ్గా ఆడలేకపోయాడు. వచ్చీ రాగానే పెవిలియన్ చేరాడు.

పాయింట్ల పట్టికలో కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్..
ఇక పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విషయానికొస్తే ఆడిన ఏడు మ్యాచులు ఆడి.. నాలుగింటిలో ఓడింది. ఆరు పాయింట్లలో ఆరో స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ విషయానికొస్తే... ఆరు మ్యాచులు ఆడి నాలుగింటిలో గెలిచింది. 8 పాయింట్లలో నాలుగో స్థానంలో నిలిచింది.

Story first published: Wednesday, April 16, 2025, 15:31 [IST]
Other articles published on Apr 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+