For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH VS RR: బికినీలో సెగలు రేపుతోన్న ట్రావిస్ హెడ్ భార్య! - సంపాదనలోనూ మొగుడు కన్నా ఎక్కువే!

ఐపీఎల్ 2025 సందడి మొదలైపోయింది. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ - రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఒకప్పుడు సన్‌రైజర్స్‌ అంటే డేవిడ్ వార్నర్‌ మెరుపులే తెలుగు క్రికెట్ అభిమానులకు గుర్తుకొచ్చేవి. ఓపెనర్‌గా క్రీజులో అడగుపెట్టడం ఆలస్యం.. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో జట్టుకు మెరుపు ఆరంభాలను అందించడమే లక్ష్యంగా పరుగులు చేసేవాడు. వార్నర్ వెళ్లిపోయాక ఆ లోటును ఆస్ట్రేలియా లెఫ్టార్మ్‌ బ్యాటర్ ట్రావిస్ హెడ్ భర్తీ చేశాడు. గత సీజన్ లో (2024) తన సంచలన బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఆ వీరుడు.. ఇప్పుడు తాజా సీజన్ లోనూ (2025) తన షోను మొదలుపెట్టేశాడు.

IPL 2025 SRH VS RR Travis Head wife jessica hot photos and net worth details
Photo Credit: instagram screenshot

105మీటర్ల భారీ సిక్స్ - 4 వేల పరుగులు...
టెర్రిఫిక్ బ్యాటింగ్ తో వరుసగా ఫోర్లు, సిక్స్ లు బాదుతూ అదరగొట్టాడు. ఓ దశలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో ఏకంగా 105 మీటర్ల పవర్ ఫుల్ భారీ సిక్స్ కూడా బాదాడు. దీంతో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. మొత్తంగా ఐపీఎల్ లో ఈ తాజా షోతో 4 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఇదే సమయంలో సోషల్ మీడియా అంతా క్రికెట్ ఫ్యాన్స్ ట్రావిస్ హెడ్ పేరుతో షేక్ ఆడిస్తున్నారు. ట్రావిస్ హెడ్ కు సంబంధించిన రికార్డులు, లగ్జరీ లైఫ్, అతడి వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం కూడా బయటకు వచ్చింది. వరల్డ్ ఫేమస్ క్రికెటర్ అయిన ట్రావిస్ హెడ్ కన్నా అతడి భార్యే ఎక్కువ సంపాదిస్తుందట.

IPL 2025 SRH VS RR Travis Head wife jessica hot photos and net worth details
Photo Credit: insta screenshot

ట్రావిస్ హెడ్ భార్య ఎవరంటే?
ప్రత్యర్థి జట్టుకు ఓ కొరకరాని కొయ్యగా మారిన ట్రావిస్ హెడ్ కు... ఐపీఎల్ లో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు ఆడే అతడికి భారత్ లో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. అలానే ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా డేవిస్ కు కూడా సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. జెస్సికాతో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన ట్రావిస్ హెడ్.. 2023 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు స్కూల్ ఫ్రెండ్స్ కూడా. వీరిద్దరికి దాదాపు ఆరేళ్ల గ్యాప్ ఉంది. 1993 డిసెంబర్ లో ట్రావిస్ హెడ్ జన్మించగా.. 1999 జులైలో జెస్సికా పుట్టింది. పెళ్లికి ముందే ఈ జంటకు ఓ పాప కూడా జన్మించింది.

IPL 2025 SRH VS RR Travis Head wife jessica hot photos and net worth details
Photo Credit: insta screenshot

వెరీ హాట్ గురూ...
జెస్సికా చూడాటానికి ఓ ప్రొఫెషనల్‌ మోడల్‌‌లా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆమె ఓ బిజినెస్‌ ఉమెన్. సిడ్నీ, కాన్‌బెర్రాలో జెస్సికాకు రెస్టారెంట్లు ఉన్నాయి. అలా ఓ వైపు వ్యాపారాన్ని చూసుకుంటూనే తన ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలోనూ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె ఇన్ స్టాలో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

IPL 2025 SRH VS RR Travis Head wife jessica hot photos and net worth details
Photo Credit: insta screenshot

నెట్ వర్త్.. భర్త కన్నా ఎక్కువే..
జెస్సికా నెట్ వర్త్ రూ.43 కోట్లు అని సమాచారం. ట్రావిస్ హెడ్ నెట్ వర్త్ రూ.24 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఉంటుందని ఇంగ్లీష్ మీడియా కథనాల్లో రాసి ఉంది. అతడు క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు, బిగ్ బాష్ లీగ్, ఐపీఎల్, బ్రాండ్ ఎండోర్స్ మెంట్ల నుంచి ఆర్జిస్తున్నాడు. ఆడిలైడ్ లో ట్రావిస్ హెడ్ కు రూ.10 కోట్లు విలువ చేసే ఓ లగ్జరీ ఇల్లు కూడా ఉంది. అలానే అతడికి మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

IPL 2025 SRH VS RR Travis Head wife jessica hot photos and net worth details
Photo Credit: instagram screenshot
IPL 2025 SRH VS RR Travis Head wife jessica hot photos and net worth details
Photo Credit: instagram screeshot
Story first published: Sunday, March 23, 2025, 17:02 [IST]
Other articles published on Mar 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+