SRH vs RR Playing 11: రాజస్థాన్‌తో తలపడే తుది జట్టు ఇదే!
SRH vs RR Playing 11: ఐపీఎల్ 2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు బలాబలాలతో పాటు తుది జట్టు వివరాలను తెలుసుకుందాం..
రికార్డులు ఏం చెబుతున్నాయి?
ఉప్పల్ స్టేడియంలో జరిగిన గత ఆరు మ్యాచుల ఫలితాల విషయానికొస్తే... ఐదింటిలో సన్‌రైజర్స్ హైదరాబాదే విజయం సాధించింది. ఇక రాజస్థాన్ రాయల్స్ తో పోటీపడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ హైదరాబాదే గెలిచింది.

బలబలాలు..
- సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగా కనిపిస్తోంది.
- ఐపీఎల్‌లోనే అత్యంత విధ్వంసకరమైన ఓపెనర్లు, దూకుడు బ్యాటర్లు సన్‌రైజర్స్ జట్టులో ఉన్నారు.
- ఓపెనర్లు అభిషేక్‌శర్మ, ట్రావిస్ హెడ్, వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్, ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి జట్టుకు అతిపెద్ద బలం.
- అనుభవంతో కూడిన నాణ్యమైన పేసర్లు సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే విషయం.
- మహ్మద్ షమితో పాటు పేసర్లు హర్షల్ పటేల్, జైదేవ్ ఉనద్కత్.. స్పిన్నర్లు ఆడమ్ జంపా, రాహుల్ చాహర్ కూడా జట్టుకు బలంగా కనిపిస్తున్నారు.
- ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు (287/3) సన్‌రైజర్స్ సొంతం . పవర్ ప్లేలో అత్యధిక పరుగుల (125/0) రికార్డు కూడా సన్‌రైజర్స్ పేరిటే ఉంది.
రాజస్థాన్ రాయల్స్.. తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. సన్‌రైజర్స్ ను ఎదుర్కోవడం ఆ జట్టుకు సవాలే.
- రాజస్థాన్ బ్యాటింగ్ అంత బలంగా ఏమీ కనపడట్లేదు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తప్ప పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హెట్‌మైర్, నితీశ్ రాణా ఎంత వరకు బలంగా బ్యాటింగ్ చేస్తారన్నది చూడాలి.
- జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్‌శర్మ, ఫజల్‌హక్ ఫారూఖీ, వనిందు హసరంగ, మహీశ్ తీక్షణతో కూడిన బౌలింగ్ టీమ్ ఎలా రాణిస్తుందో ఆడితే కానీ చెప్పలేం. గాయపడిన కెప్టెన్ సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలో దిగొచ్చు.
తుది జట్లు (అంచనా)
సన్‌రైజర్స్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీశ్‌కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), రాహుల్ చాహర్, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, మహ్మద్ షమి, జైదేవ్ ఉనద్కత్.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైశ్వాల్, షిమ్రన్ హెట్‌మైర్, నితీశ్ రాణా, జోఫ్రా ఆర్చర్, వనిందు హసరంగ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), సంజు శాంసన్, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ, సందీప్‌శర్మ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications