SRH VS RR Ishan Kishan: ఇషాన్ కిషన్ ఫ్లైయింగ్ కిస్ - ఆనందంతో పొంగిపోయిన కావ్య పాప (వీడియో)
SRH VS RR Ishan Kishan Century: టీమిండియా బ్యాటింగ్ డైనమైట్ ఇషాన్ కిషన్ మంచి ఫైర్ మీదున్నాడు. బౌండరీలతో, సిక్సర్లతో బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ ప్రాక్టీస్ మ్యాచ్‌లలో సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడిన ఇషాన్ కిషన్.. ఇప్పుడు ఐపీఎల్ 2025 సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచులో అదరగొట్టేశాడు. ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచులో సెంచరీతో వీరవిహారం చేశాడు.
తన అద్భుతమైన బ్యాటింగ్ తో వరుసగా సిక్సర్లు, ఫోర్లు బాదేస్తున్న అతడికి.. ఐపీఎల్‌లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. మొత్తంగా 45 బంతుల్లో10 పోర్లు, 6 సిక్సల సాయంతో 100 పరుగుల మార్క్ ను టచ్ చేశాడు. దీంతో ఉప్పల్ స్టేడియం అంతా ఇషాన్ కిషన్ పేరుతో మార్మోగిపోయింది. స్టేడియం అంతా అతడి నామస్మరణతో దద్దరిల్లిపోయింది.

ఇషాన్ కిషన్ ఫ్లైయింగ్ కిస్ - కావ్య పాప సెలబ్రేషన్స్
ఈ మ్యాచ్ 13వ ఓవర్ లో మొదటగా హాఫ్ సెంచరీ బాదాడు ఇషాన్ కిషన్. 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి తనను విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించాడు. వరుస సిక్సర్లు బాదుతూ ఈ మైలురాయిని టచ్ చేసిన అతడు, ఆ తర్వాత సెలబ్రేషన్స్ చేసుకున్నాడు . అక్కడున్న ప్రేక్షకులందరికీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఇక ఇషాన్ కిషన్ ప్రదర్శనతో హైదరాబాద్ ఓవర్ కావ్య మారన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇషాన్ కిషన్ విధ్వంసం చూసి కేరింతలు కొడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. సీట్ లో నుంచి లేచి అభినందిస్తూ కేరింతలతో ప్రోత్సాహించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications