SRHపై నిప్పులు చెరిగిన శార్దూల్ ఠాకూర్ - అన్‌సోల్డ్‌గా వచ్చి బ్యాటర్లకు యముడుగా...
SRH VS LSG : ఐపిఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోని శార్దూల్ ఠాకూర్.. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మెహ్సిన్ ఖాన్ గాయపడి జట్టు నుంచి తప్పుకోవడం వల్ల శార్దూల్ కు లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడే అవకాశం వచ్చింది. ఇప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్న ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు.
2 బంతుల్లో 2 కీలక వికెట్లు..
తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచులో ఆ జట్టుకు ఆరంభంలోనే షాకిచ్చాడు శార్దూల్ ఠాకూర్. హైదరాబాద్ జట్టు 15 పరుగులకే.. 2.2 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిపోయేలా చేశాడు. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి అదరగొట్టాడు. మొదట ఠాకూర్ వేసిన 2.1 ఓవర్ కు నికోలస్ పూరన్ ను క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు అభిషేక్ శర్మ(6). ఇషాన్ కిషన్.. వికెట్ కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుదిరిగాడు. అయితే శార్దూల్ ఠాకూర్ వేసిన మూడో బంతిని నితీష్ కుమార్ రెడ్డి అడ్డుకున్నాడు. దీంతో శార్దూల్ హ్యాట్రిక్ మిస్సైంది.మొత్తంగా ఈ మ్యాచులో తన 4 ఓవర్ల స్పెల్‌లో 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తద్వారా ప్రస్తుత సీజన్ లో లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. పర్పుల్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు.
అంతకుముందు దిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో 2 ఓవర్లు వేసిన అతడు.. 19 పరుగులే సమర్పించుకుని 2 వికెట్లు పడగొట్టాడు. అలా వరుసగా రెండు మ్యాచుల్లోనూ తానేంటో నిరూపించుకున్నాడు.

అదరగొట్టిన ప్రిన్స్ యాదవ్..
అయితే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్ పరుగులు చేస్తూ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది. కానీ ఆ తర్వాత లక్నో బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఆడారు. దీంతో దూకుడుగా ఆడిన ట్రావిస్ హెడ్ (47) ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. అతడు 28 బంతుల్లో 167.86 స్టైక్ రేట్ తో 5 ఫోర్లు, 3 సిక్స్ లతో దూకుడుగా ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications