For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH VS LSG: సన్‌రైజర్స్‌ను దడపుట్టించిన లక్నో - భారీ విజయం

IPL 2025 SRH VS LSG : ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ పై లక్నోసూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 5 వికెట్లు తేడాతో గెలిచింది. సన్‌రైజర్స్ జట్టు పూర్తిగా తేలిపోయింది.

190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 16.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 193 పరుగులు చేసింది. మ్యాచ్ విజయంలో శార్దూల్ ఠాకూర్ (4/34), నికోలస్ పూరన్ (70), మిచెల్ మార్ష్(52) కీలకంగా వ్యవహరించారు.

IPL 2025 SRH VS LSG Lucknow Super Giants won match by 5 wickets against Sunrisers hyderabad
Photo Credit: twitter screenshot

పూరన్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 70 పరుగులు ఆకాశమే హద్దుగా ఆడాడు. మిచెల్‌ మార్ష్‌ 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 52 పరుగులతో చెలరేగి ఆడాడు. వీరిద్దరు దూకుడుతో ఆడడంతో లఖ్‌నవూ దాదాపు లక్ష్యాన్ని కరిగించేసింది. చివర్లో అబ్దుల్‌ సమద్‌ (22*) దూకుడుగా ఆడి విజయాన్ని అందించాడు. సన్ రైజర్స్ ‌ బౌలర్లలో కమిన్స్‌ 2 వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ, జంపా, హర్షల్‌పటేల్ చెరో‌ వికెట్‌ తీశారు.

300స్కోరు అంచనాలతో దిగి..
అంతకుముందు 300 స్కోరు అంచనాలతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లో 190 పరుగులకే ఆలౌట్ అయింది. శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సన్‌రైజర్స్ పతనం శాసించాడు. ప్రిన్స్ యాదవ్, ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రథి, రవి బిష్ణోయ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ట్రావిస్ హెడ్ (47; 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన అనికేత్ వర్మ (36; 13 బంతుల్లో) మెరుపులు మెరిపించాడు. నితీశ్‌ రెడ్డి (32; 28 బంతుల్లో), హెన్రిచ్ క్లాసెన్ (26; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. పాట్ కమిన్స్ (18; 4 బంతుల్లో) హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాది ఔట్ అయ్యాడు. అభిషేక్ శర్మ (6), ఇషాన్ కిషన్ (0), అభినవ్‌ మనోహర్ (0) విఫలమయ్యారు.

సిక్సర్లతో అనికేత్ మెరుపు..
క్లాసెన్ ఔట అయిన తర్వాత క్రీజోలోకి వచ్చిన అనికేత్ వరుస సిక్సర్లతో విజృంభించాడు. కాకాపోతే దూకూడుగా ఆడుతూ డేవిడ్‌ మిల్లర్‌ చేతికి పెవిలియన్ చేరాడు. 13 బంతుల్లో 276.92 స్ట్రైక్ రేట్ తో 36 పరుగులతో చేలరేగాడు. జట్టు 190/9 గౌరవప్రదమైన స్కోర్ చేసేలా చేశాడు. బిష్ణోయ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన అతడు.. దిగ్వేశ్‌ బౌలింగ్‌లోనూ వరుసగా మరో రెండు సిక్స్‌లు బాది ఆకట్టుకున్నాడు.

Story first published: Thursday, March 27, 2025, 23:16 [IST]
Other articles published on Mar 27, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+