Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH VS LSG:సన్‌రైజర్స్‌కు దెబ్బ మీద దెబ్బ.. కాటేరమ్మ కొడుకు ఢమాల్

ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు టెర్రిఫిక్ బౌలింగ్ చేస్తున్నారు. సన్‌రైజర్స్ భారీ హిట్లర్లను ఎవరినీ వదలట్లేదు. వరుస పెట్టి పెవిలియన్ కు పంపుతున్నారు. శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్.. సన్‌రైజర్స్ బ్యాటర్లపై విరుచుకుపడుతున్నారు.

అయితే సన్‌రైజర్స్ లో కీలక ప్లేయర్ అయిన హెన్రిచ్ క్లాసేన్ గురించి తెలుగు క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇతడు సృష్టించే విధ్వంసానికి.. ఫ్యాన్స్ ముద్దుగా కాటేరమ్మ కొడుకు అని పిలుచుకుంటుంటారు. అయితే అలాంటి హెన్రిచ్ క్లాసిన్.. తాజా మ్యాచులో.. ఊహించని రీతిలో పెవిలియన్ చేరాడు. రనౌట్ గా వెనుదిరిగాడు. అతడు రనౌట్ అవ్వడంతో స్టాండ్స్ కూర్చొన్న కావ్య మారన్ తలపట్టేసుకుంది. ఒక్కసారిగా లేచి నిలబడి మరీ అరుస్తూ నిరాశ వ్యక్తం చేసింది.

అతడి చేతికి తాకిన గాయం..
12వ ఓవర్ లో చివరి బంతికి హెన్రిచ్ ఔట్ అయ్యాడు. నితీశ్ బాదిన బంతిని ప్రిన్స్ యాదవ్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే బంతి ప్రిన్స్ యాదవ్ చేతికి తాకి దెబ్బ కూడా తగిలింది. కానీ బంతి అలానే గాల్లోకి ఎగిరి స్టంప్ ను గిరాటేసింది. అప్పటికీ క్రీజు దాటి హెన్రిచ్ బయటకు వచ్చాడు. దీంతో దురదృష్టవశాత్తుగా హెన్రిచ్ రనౌట్ అయ్యాడు. అలా సన్ రైజర్స్ మరో కీలక వికెట్ ను కోల్పోవాల్సి వచ్చింది.

12వ ఓవర్ చివరి బంతికి హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. హెన్రిచ్ క్లాసెన్ 25 పరుగులు చేసిన తర్వాత రనౌట్ అయ్యాడు. ప్రిన్స్ యాదవ్ ఫుల్-టాస్ బంతిని బౌలింగ్ చేయగా, నితీష్ ముందుకు షాట్ ఆడాడు. ప్రిన్స్ బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, బంతి అతని చేతిని తాకి వెళ్లి స్టంప్స్‌ను తాకింది. క్లాసెన్ క్రీజు నుంచి బయటకు రావడంతో రనౌట్ అయ్యాడు.

IPL 2025 SRH VS LSG Kavya Maran reaction viral when Henrich Klaasen run out by prince yadav
Photo Credit: twitter screenshot
Story first published: Thursday, March 27, 2025, 21:15 [IST]
Other articles published on Mar 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+