Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కావ్య పాపకు రూ.14 కోట్లు బొక్క.. నమ్మినవాడే ముంచేశాడు!

IPL 2025: గతేడాది ఐపీఎల్ ఫైనల్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పరిస్థితి ఈ సారి దారుణంగా ఉంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడగా.. వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ హై పవర్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. ఇది కాకుండా జట్టు అత్యంత నమ్మకంగా ఉన్న బ్యాటర్లలో ఒకరు దారుణంగా విఫలమయ్యారు. ఈ బ్యాటర్ మరెవరో కాదు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ.

అభిషేక్ బ్యాట్ నుంచి రాని పరుగులు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ప్రారంభంలోనే ఔటయ్యాడు. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌‌ రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలోనే తమ ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. అభిషేక్ శర్మ 16 బంతుల్లో 18 పరుగులు చేశాడు. గుజరాత్ ఫాస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఐదో ఓవర్లో అభిషేక్ శర్మను ఔట్ చేశాడు. అభిషేక్ శర్మ లెంగ్త్ డెలివరీలో హై షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ అంచుకు తగిలింది.

IPL 2025 SRH Struggles - Fans Furious Over Abhishek Sharma s Performance

ఈ సీజన్ ప్రత్యేకంగా ఏమీ లేదు..
ఈ సీజన్‌లో ఇప్పటివరకు అభిషేక్ శర్మ బ్యాట్‌తో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. 24 ఏళ్ల అభిషేక్ శర్మ ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. అభిషేక్ సగటు 10.20 గా ఉండడం గమనార్హం. గత సంవత్సరం అభిషేక్ 16 మ్యాచ్‌ల్లో 32.26 సగటుతో, 2014.21 అద్భుతమై స్ట్రైక్ రేట్ తో 484 పరుగులు చేశాడు.

ఐపీఎల్ 2025 వేలానికి ముందు సన్ రైజర్స్ ఫ్రాంచైజీ అభిషేక్ శర్మను రూ.14 కోట్లకు నిలుపుకుంది. సన్‌రైజర్స్ జట్టు అభిషేక్ త్వరగా ఫామ్‌లోకి రావాలని కోరుకుంటోంది. తద్వారా వారు పాయింట్ల పట్టికలో పైకి రాగలరు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ మొదటి ఐదు మ్యాచ్ ల్లో కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచి ప్రస్తుతం అట్టడుగు స్థానంలో ఉంది.

సిరాజ్ ముందు మోకరిల్లారు..
మహ్మద్ సిరాజ్ బౌలింగ్ గుజరాత్ టైటాన్స్‌కు గొప్ప ఆరంభాన్ని ఇచ్చింది. మ్యాచ్ తొలి ఓవర్లోనే ప్రమాదకరమైన ట్రావిస్ హెడ్ వికెట్ ను పేసర్ సిరాజ్ పడగొట్టాడు. ట్రావిస్ హెడ్ మొదటి ఓవర్లోనే మిడ్-వికెట్ లో సాయి సుదర్శన్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత సిరాజ్ అభిషేక్ శర్మను వెనక్కి పంపి తన జట్టును బలమైన స్థితిలో ఉంచాడు. సన్ రైజర్స్ పరిస్థితిని మరింత దిగజార్చేలా ఇషాన్ కిషన్(17) కూడా ఎనిమిదో ఓవర్లో ఔటయ్యాడు.

Story first published: Monday, April 7, 2025, 11:32 [IST]
Other articles published on Apr 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+