Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఆ నలుగురు రిటైన్ + ఆ ఇద్దరిని ఆర్‌టీమ్‌తో.. సీఎస్కే రిటైన్ లిస్ట్ ఇదే!

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌‌ను బీసీసీఐ ప్రకటించింది. ఆరుగురు ప్లేయర్లను ఓ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. అయితే గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్ కల్పించింది. రిటెన్షన్ పాలసీ ప్రకారం నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా దక్కించుకోవచ్చు.

అక్టోబర్ 31వ తేదీలోపు తమ రిటెన్షన్ లిస్ట్‌ను అన్ని ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. ఈ నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చే ఆలోచన ఫ్రాంచైజీలకు బీసీసీఐ వదిలేసింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లుగా నిర్ణయించింది.

IPL 2025 Six Key Players CSK Might Retain Ahead of the Mega Auction

అయితే కేవలం రిటెన్షన్‌ను మాత్రమే ఉపయోగిస్తే పర్స్ వ్యాల్యూలోని రూ.120 కోట్లలో దాదాపు రూ.75 కోట్లకు పైగా మొత్తాన్ని కోల్పోవాల్సి రానుండటంతో సీఎస్కే తమ వ్యూహాలను మార్చింది. నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలని భావిస్తుంది. ఎంఎస్ ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా జట్టులో కొనసాగించనుంది. అతని కోసం రూ.4 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక మిగిలిన రిటెన్షన్ స్లాబ్స్ ప్రకారం ముగ్గరు ఆటగాళ్లు మాత్రమే రిటైన్ చేసుకోవాలని భావిస్తుంది.

రిటెన్షన్ లిస్ట్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రథమ ఎంపికగా ఖరారు చేసింది. తర్వాతి స్థానాల్లో రవీంద్ర జడేజా, శివమ్ దూబెను సెలక్ట్ చేసింది. అంటే ఈ ఆటగాళ్లకు నిర్ణీత ధర ప్రకారం వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఖర్చు పెట్టనుంది. ఇక మతీష పతిరానా, రచిన్ రవీంద్రను ఆర్‌టీఎమ్ కార్డ్‌ ద్వారా తిరిగి జట్టులోకి తీసుకురావాలని భావిస్తుంది. తొలుత పతిరానాను నేరుగా రిటైన్ చేసుకోవాలని సీఎస్కే భావించింది.

కానీ రిటెన్షన్ లిస్ట్‌లో నాలుగో స్లాట్‌ను ఉపయోగిస్తే రూ.18 కోట్లు కోల్పోవాల్సి వస్తుందని ఆర్‌టీఎమ్ కార్డ్‌తో దక్కించుకోవాలని సీఎస్కే భావిస్తుంది. అయితే దూబె స్థానంలో పతిరానాను రిటైన్ చేసుకుని, దూబెను ఆర్‌టీఎమ్‌తో సొంతం చేసుకునేలా, అలాగే వేలంలో ధరను బట్టి.. రచిన్ రవీంద్రకు బదులుగా తుషారా దేశ్‌పాండేను ఆర్‌టీఎమ్‌తో దక్కించుకునే ప్లాన్‌లోనూ సీఎస్కే ఉంది.

సీఎస్కే రిటెన్షన్ లిస్ట్ (అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ (అన్‌క్యాప్డ్), మతీషా పతిరానా, రచిన్ రవీంద్ర/తుషార దేశ్‌పాండే.

Story first published: Tuesday, October 8, 2024, 13:42 [IST]
Other articles published on Oct 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+