Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shubman Gill: '3 ఏళ్ల నుంచి..'- డేటింగ్ రూమర్స్‌పై నోరు విప్పిన గిల్

Shubman Gill On Dating Rumours: గత కొద్ది కాలంగా టీమిండియా యంగ్ అండ్ స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ వ్యక్తిగత జీవితంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి ఎక్కువైపోయింది. అతడు ఎవరితో కలిసి తిరుగుతున్నాడు, ఎవరితో డేటింగ్ చేస్తున్నాడు, ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు వంటి విషయాలపై ఆరా తీయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో అతడి డేటింగ్ లైఫ్ పై రూమర్స్ తరచుగా రావడం ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా తన డేటింగ్ లైఫ్ పై క్లారిటీ ఇచ్చాడు గిల్. తాను ఎవరితో రిలేష‌న్‌షిప్‌లో ఉన్నాడో స్పష్టత ఇచ్చాడు.

ఆ నలుగురితో..
శుభ్‌మన్ గిల్‌.. బాలీవుడ్ భామలతో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు ఆ మధ్యలో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. మొదటగా.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. కానీ ఆ తర్వాతే పలువురు ముద్దుగుమ్మల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సారా అలీఖాన్, రిద్ధిమా పండిట్‌, అవనీత్ కౌర్ ఇలా పేర్లు వినిపించాయి. గిల్ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెగ ప్రచారం సాగింది. అంతటా అతడి పెళ్లి గురించే చర్చ ఎక్కువైంది.

మూడేళ్ల నుంచి..
ఈ క్రమంలోనే గిల్ తాజాగా తన డేటింగ్ రూమర్స్ పై స్పందించాడు. "నేను గత 3 ఏళ్లుకు పైగా సింగిల్‌గానే ఉన్నాను. ఈ మధ్య చాలా మందితో నాకు లింక్ చేస్తూ ఊహాగానాలు, పుకార్లు వస్తున్నాయి. కొన్నిసార్లు అవి మరింత దారుణంగా ఉన్నాయి. నేను ఎప్పుడూ చూడని, కలవని వ్యక్తితో కూడా లింకులు పెడుతున్నారు. ప్రస్తుతం నేను నా ప్రొఫెషనల్ కెరీర్‌పై దృష్టి పెట్టాను." అని గిల్ చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా ఏప్రిల్ 21న తన పెళ్లి గురించి కూడా స్పందించాడు. ఇప్పట్లో చేసుకునేది లేదని తేల్చిచెప్పాడు.

మాటల్లో చెప్పలేను!
అలానే కోహ్లీ, రోహిత్ తో కలిసి ఆడటంపై కూడా మాట్లాడాడు గిల్. "రోహిత్ భాయ్, విరాట్ భాయ్ వంటి ఆటగాళ్లను చూస్తూ పెరిగాను. ఇప్పుడు వారితో కలిసి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఆ అనుభూతిని వర్ణించడం కష్టమే." అని చెప్పుకొచ్చాడు.

IPL 2025 Shubman Gill reacts On his Dating Rumours says he is single for over 3 years
Story first published: Saturday, April 26, 2025, 17:30 [IST]
Other articles published on Apr 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+