For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: ఢిల్లీపై విజయం తర్వాత శుభ్‌మన్ గిల్‌కు బిగ్ షాక్

IPL 2025: శనివారం జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. కానీ గెలుపు సంబరంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు బిగ్ షాక్ తగిలింది. శుభ్‌మన్ గిల్‌పై బీసీసీఐ రూ.12 లక్షల జరిమానా విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ జరిమానా విధించబడింది. ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ అద్భుతంగా రాణించి అజేయంగా 97 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అయ్యాడు.

ప్రకటన విడుదల చేసిన ఐపీఎల్
నిర్ణీత సమయంలో గుజరాత్ టైటాన్స్ పూర్తి ఓవర్లు బౌలింగ్ చేయలేదు. ఇది ఐపీఎల్ లో అతని మొదటి తప్పు కావడంతో శుభ్‌మన్ గిల్ కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది. "అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్లో ఓవర్ రేట్ ను కొనసాగించినందుకు జరిమానా విధించబడింది.'అని ఐపీఎల్ తన ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం శుభ్‌మన్ గిల్ ఈ సీజన్ లో చేసిన మొదటి తప్పు ఇది. ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కొనసాగించడంతో గిల్‌కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది.

IPL 2025 Shubman Gill Fined Rs 12 Lakh After Win Against Delhi Capitals

విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన జోస్ బట్లర్
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్ జోస్ బట్లర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జోస్ బట్లర్ 54 బంతుల్లో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్ లో బట్లర్ 4 సిక్సర్లు, 11 ఫోర్లు కొట్టాడు. 3 పరుగుల తేడా సెంచరీ సాధించే అవకాశాన్ని కూడా కోల్పోయాడు. బట్లర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు గానూ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ కూడా 34 బంతుల్లో 43 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.

ఆ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. ఢిల్లీ తరఫున కెప్టెన్ అక్షర్ పటేల్ అత్యధికంగా 39 పరుగులు చేశాడు. అతను 32 బంతుల్లో 2 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టాడు. కరుణ్ నాయర్ 31, కేఎల్ రాహుల్ 28, ట్రిస్టన్ స్టబ్స్ 31, అశుతోష్ శర్మ 37 పరుగులు చేశారు.

Story first published: Sunday, April 20, 2025, 15:47 [IST]
Other articles published on Apr 20, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+