Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: శార్దూల్ ఠాకూర్‌కు కమ్‌బ్యాక్ ఆఫర్.. ఆ ప్లేయర్‌కు రీప్లే‌స్‌మెంట్‌గా!

IPL 2025 Shardul Thakur: ఐపీఎల్ 2025కు వేళైంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చేటు చేసుకుంది. ఐపీఎల్ 2025 కోసం జరిగిన మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలి పోయిన శార్దూల్ ఠాకూర్ కు... ఆడే అవకాశం వచ్చింది. ఇంతకీ అతడు ఏ జట్టుతో కలవనున్నాడు? ఎవరి స్థానంలో బరిలోకి దిగి ఆడనున్నాడు? వంటి విషయాలను తెలుసుకుందాం..

అతడి స్థానంలో రీప్లే‌స్‌మెంట్‌గా..
చెన్నై సూపర్ కింగ్స్.. శార్దూల్ ఠాకూర్‌ను వేలంలోకి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అతడిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలి పోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అతడికి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌లో గాయపడిన ఆటగాడి స్థానంలో రీప్లే‌స్‌మెంట్‌గా ఆడే ఛాన్స్ వచ్చింది.

ఆ మధ్య లఖ్‌నవూ ప్లేయర్ మోహ్సిన్ ఖాన్ గాయపడ్డాడు. కానీ అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదు. దీంతో లఖ్‌నవూ యాజమాన్యం.. మోహ్సిన్ స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకుందట. అలానే మరో పేసర్ మయాంక్ యాదవ్ కూడా ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం అందింది. అతడు ఐపీఎల్‌లో కొన్ని మ్యాచులకు దూరం కానున్నాడట.

ఇప్పుడే నిర్ణయం తీసుకోలేం..
"మా ఆటగాళ్లు గాయాల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరేమో నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నారు. మరికొందరు ఫిజియోల పర్యవేక్షణలో ఉన్నారు. వారి గురించి ఇప్పుడే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేం." అని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మెంటార్ జహీర్ ఖాన్ ఇటీవలే పేర్కొన్నాడు.

తొలి మ్యాచ్ ఎప్పుడంటే
కాగా, లఖ్‌నవూ తన తొలి మ్యాచ్ ను మార్చి 24న దిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది. విశాఖపట్నం వైయస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ కు శార్దూల్ ఠాకూర్ అందుబాటులో ఉంటాడని తెలిసింది.

IPL 2025 Shardul Thakur Likely to Replace Mohsin Khan in LSG Squad
Story first published: Friday, March 21, 2025, 12:13 [IST]
Other articles published on Mar 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+