IPL 2025 Schedule: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. ఓపెనింగ్ మ్యాచ్ ఆ 2 జట్ల మధ్యే.. SRH పోరు ఎప్పుడంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 పూర్తి షెడ్యూల్ వివరాలు వచ్చేశాయి. 65 రోజుల పాటు సాగే 74 మ్యాచుల పూర్తి వివరాలను అధికారికంగా మెగా లీగ్ నిర్వాహకులు ప్రకటించారు. మార్చి 22 నుంచి మే 18 వరకు 70 లీగ్ మ్యాచులు జరగనున్నాయి. ప్లే ఆఫ్స్ మే 20 నుంచి మే 25 వరకు నిర్వహించనున్నారు.
మార్చి 22న ఓపెనింగ్ మ్యాచ్ కోల్ కతా వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. మార్చి 23న రెండు మ్యాచులు జరగనున్నాయి. అందులో తొలి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగగా... రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ - ముంబయి ఇండియన్స్ మధ్య జరగనుంది. ఎలిమినేటర్, క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లు మే 20, 21 తేదీలలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ కోల్ కతా ఈడెన్స్ గార్డెన్స్ లో జరగనుంది.

హైదరాబాద్ మ్యాచులు ఎప్పుడంటే?
హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను రాజస్థాన్‌తో మార్చి23న తలపడనుంది ఆ తర్వాత మార్చి 27న లఖ్‌నవూతో, మార్చి 30న దిల్లీ క్యాపిటల్స్, ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్ రైడర్స్ తో, ఏప్రిల్ 6న గుజరాత్, ఏప్రిల్ 12 పంజాబ్ కింగ్స్ తో, ఏప్రిల్ 17న ముంబయి ఇండియన్స్, 23న ముంబయి ఇండియన్స్, 25న చెన్నై సూపర్ కింగ్స్, మే 2న గుజరాత్ టైటాన్స్, 5న దిల్లీ క్యాపిటల్స్, 10న కోల్‌కతా, 13న ఆర్సీబీ, మే 18న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తో ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications