ఐపీఎల్ 18వ సీజన్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచుల షెడ్యూల్ గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. మ్యాచ్‌ల తేదీలను బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌ల తేదీలు, వాటి వేదికల గురించి డీటెయిల్స్ తెలిశాయి.
ఓపెనింగ్, ఫైనల్ మ్యాచ్ అక్కడే..
ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ మార్చి 22, శనివారం రోజు ఉండనుందని తెలిసింది. ఫైనల్ మ్యాచ్ మే 25 ఆదివారం జరగనుందని సమాచారం అందింది. ఈ రెండు మ్యాచులు డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్ కతా హోం గ్రౌండ్ లో నిర్వహిస్తారట. రిపోర్ట్స్ ప్రకారం.. ఓపెనింగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభం కానుంది. కోల్ కతా సొంత మైదానం అయిన ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు.

రెండో మ్యాచ్ ఆ ఇద్దరి మధ్య
కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మొదటి మ్యాచ్ జరగగా.. ఆ మరుసటి రోజే, గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య మార్చి 23 ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్.. హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో మధ్యాహ్నం ప్రారంభం అవుతుంది.
12 వేదికల్లో..
మొత్తంగా ఈ సీజన్ లోని అన్ని మ్యాచులు 12 వేదికల్లో నిర్వహించనున్నారు. అహ్మాదాబాద్, ముంబయి, చెన్నై, బెంగళూరు, లఖ్ నవూ, ముల్లాన్ పూర్, దిల్లీ, జైపుర్, కోల్ కతా, హైదరాబాద్, గుహావటి, ధర్మశాలలో జరగనున్నాయి.
అహ్మదాబాద్ - నరేంద్ర మోదీ స్టేడియం (గుజరాత్ టైటాన్స్ హోమ్ వెన్యూ)
బెంగళూరు - చిన్నస్వామి స్టేడియం (RCB హోమ్ వెన్యూ)
చెన్నై - MA చిదంబరం స్టేడియం (CSK హోమ్ వెన్యూ)
దిల్లీ - అరుణ్ జైట్లీ స్టేడియం (దిల్లీ క్యాపిటల్స్ హోమ్ వెన్యూ)
ధర్మశాల - హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (PBKS రెండో హోమ్ వెన్యూ)
గువాహతి - బర్సపరా స్టేడియం (RR రెండో హోమ్ వెన్యూ)
హైదరాబాద్ - రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (SRH హోమ్ వెన్యూ)
జైపుర్ - సవాయ్ మాన్సింగ్ స్టేడియం (RR హోమ్ వెన్యూ)
కోల్‌కతా - ఈడెన్ గార్డెన్స్ (KKR హోమ్ వెన్యూ)
లఖ్ నవూ - BRSABV ఎకానా స్టేడియం (LSG హోమ్ వెన్యూ)
ముల్లాన్‌పూర్ - మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (PBKS హోమ్ వెన్యూ)
ముంబయి - వాంఖడే స్టేడియం (ముంబయి ఇండియన్స్ హోమ్ వేదిక)
హైదారాబాద్ లో రెండు ప్లేఆఫ్ మ్యాచులు..
ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ కు సంబంధించిన మూడు మ్యాచులు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రెండు ప్లే-ఆఫ్ మ్యాచ్‌లు (క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్)... క్వాలిఫయర్ 2, టైటిల్ పోరు కోల్ కతాలో జరగనుంది.