IPL 2025: పవర్‌ఫుల్‌గా ఆర్‌సీబీ.. తుది జట్టు అంచనా ఇదే
మరో 10 రోజుల్లో మార్చి 22న ఐపీఎల్ 2025 పండగ ప్రారంభం కానుంది. ఈ మెగా లీగ్ ఓపెనింగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. తొలి మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలోనే ట్రోఫీని ముద్దాడని ఆర్సీబీ.. ఎలాగైనా టైటిల్ ను గెలుచుకోవాలని బలమైన జట్టుతో, కొత్త కెప్టెన్ రజిత్ పాటిదర్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ జట్టు బలాబలాలతో పాటు తొలి మ్యాచ్ తుది జట్టు వివరాలను తెలుసుకుందాం.

తొలి మ్యాచ్‌లో ఎవరే స్థానంలో రావొచ్చంటే? (అంచనా)
తొలి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తాడు. ఎన్నో ఏళ్లుగా ఆర్సీబీలో బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ గా కొనసాగుతోన్న అతడికే.. ఈ సీజన్ లోనూ తన డైనమిక్ హీరోయిజంతో జట్టును విజయపథంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కోహ్లీతో పాటు మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేస్తాడు. గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీలోని మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యాటర్లలో కెప్టెన్ రజత్ పాటిదర్ ఒకడు. అతడు నెం.3లో బ్యాటింగ్ చేయొచ్చు. ఆల్ రౌండ్ లియామ్ లివింగ్ స్టోన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి ఆడొచ్చు. అతడు బంతితోనూ రాణించగలడు. కృనాల్ పాండ్య కూడా బంతితోనూ బ్యాట్ తోనూ పర్ఫక్ట్ బ్యాలెన్స్ ఇవ్వగలడు. గతంలో అతడు ఇతర జట్లకు వివిధ స్థానాల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం ఉంది. ఈసారి అతడు ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశముంది.
వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జితేశ్ శర్మ నెం.6లో రావొచ్చు. అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యం ఆర్సీబీ బాగా తోడ్పడచ్చు. పవర్ హిట్టింగ్ కి పేరున్న టిమ్ డేవిడ్ నెం.7లో దిగి ఫినిషింగ్ బాధ్యతను తీసుకుంటాడు. ఆటను ముగించడంలో అతడు కీలకంగా వ్యవహరిస్తాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బంతితో కీలకంగా వ్యవహరించే అవకాశముంది. పవర్ ప్లేలో అతడు కొత్త బంతితో చేసే మాయే ఆర్సీబీ విజయాన్ని నిర్ణయిస్తుంది.
సుయాశ్ శర్మ స్పిన్ ఈ సీజన్ లో ఆర్సీబీకి ఎంతో కీలకం. అతడి నుంచి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ ను ఆర్సీబీ కోరుకుంటోంది. గత సీజన్ లో ఆర్సీబీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ బౌలర్ యశ్ దయాల్. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ తన అద్భుత ప్రదర్శన మళ్లీ కొనసాగిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అన్ని ఫార్మాట్లలోనూ జోష్ హెజిల్ వుడ్ తాను ఎంత పవర్ ఫుల్ బౌలరో ఇప్పటికే నిరూపించుకున్నాడు. అతడి అనుభవం ఆర్సీబీకి ఎంతో ఉపయోగపడనుంది. తొలి మ్యాచ్ లో జోష్ హెజిల్ వుడ్, భువనేశ్వర్ కలిసి కొత్త బంతితో చేసే మాయ.. ఆర్సీబీకి ఎంతో కీలకం. ఇక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ స్వప్నిల్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగొచ్చు.
కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)
విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్ స్టోన్, కృనాల్ పాండ్య, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, జోష్ హెజిల్ వుడ్/లుంగి ఎంగిడి .
ఇంపాక్ట్ ప్లేయర్ - స్వప్నిల్ సింగ్
జట్టు బలాలు(మొత్తంగా)..
ప్రతి సీజన్ లోనూ బలమైన బ్యాటింగ్ లైనప్ RCB ప్రధాన బలం. ఈ సారి కూడా అలానే బరిలోకి దిగుతోంది. ఇంగ్లీష్ జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెనర్ గా కీలకం కానున్నాడు. గత రెండు నెలలుగా పరిశీలిస్తే అతడు ఇంగ్లాండ్ తరపున ఉపఖండంలో ధాటిగా పరుగులు చేస్తున్నాడు. గత సీజన్‌లో KKR తరపున 12 ఇన్నింగ్స్‌లో 182 స్ట్రైక్ రేట్‌తో 435 పరుగులు సాధించాడు. చిన్నస్వామి స్టేడియం ఎలాగో బ్యాటింగ్ కు అనుకూలంగా బ్యాటర్లకు స్వర్గధామంలా ఉంటుంది కాబట్టి.. ఫిల్ సాల్ట్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వొచ్చు. పైగా కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు కాబట్టి, ఈ డెడ్లీ కాంబినేషన్ మంచిగా రాణించొచ్చు. కోహ్లీ-ఫిల్ సాల్ట్ తర్వాత కొత్త కెప్టెన్ పాటిదార్, దేవదత్ పడిక్కల్ జట్టులో కీలకం. అలానే లియామ్ లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్ రూపంలో ఇద్దరు పవర్ హిట్లర్లు ఉన్నారు. ఇంకా జితేష్ శర్మ, కృనాల్ పాండ్యాపై బలంగా ఆశలు ఉన్నాయి. ఇక వీరితో పాటు ఆర్సీబీలో అనుభవజ్ఞులైన పేసర్లు కూడా ఉండటం కలిసొచ్చే అంశం.
బలహీనతలు..
RCB ప్రధాన బలహీనత జట్టులో ఫ్రంట్‌లైన్ స్పిన్నర్ లేకపోవడం. ఇప్పుడు వారు జట్టులోకి కొత్తగా వచ్చిన ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. వాస్తవాడనికి అతడు IPL 2024లో అత్యుత్తమ ప్రదర్శన చేయలేదు. 42.5 సగటుతో 14 మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. KKR తరపున 13 ఆటలు ఆడి 10 వికెట్లు తీసిన సుయాష్ శర్మ.. గత సీజన్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. భువనేశ్వర్ కుమార్, దయాల్ కు సపోర్ట్ గా నాణ్యమైన భారత పేస్ యూనిట్ కూడా లేదనే వాదన వినిపిస్తోంది. కుడిచేతి వాటం ఉన్న మీడియం-ఫాస్ట్ బౌలర్ రసిఖ్ సలాం దార్‌కు పెద్దగా అనుభవం లేదు. ఎక్కువ మొత్తంగా పెట్టి కొనుగోలు చేసిన ఇతడు ఎలా రాణిస్తాడో. మొత్తంగా యువకులు, అనుభవజ్ఞులు కలగలిపిన ఆటగాళ్లతో ఆర్సీబీ పైకి బానే ఉంది. చూడలి మరి ఆర్సీబీ వీళ్లను ఎలా ఉపయోగించుకుంటుందో..
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications