Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma: గోయెంకా సార్.. ఎందుకు అంత..?

సంజీవ్ గోయెంకా.. గత రెండు సీజన్లుగా ఈ పేరు బాగా వినిపిస్తోంది. అందుకు కారణం జట్టు ఆటగాళ్లతో ఈ లక్నో ఓనర్ కాస్త దురుసుగా ప్రవర్తించడమే! గత సీజన్‌లో కేఎల్ రాహుల్‌తో.. ఈ సీజన్‌లో రిషభ్ పంత్‌తో ఆయన ప్రవర్తించిన తీరు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అందుకే సంజీవ్ గోయెంకా పేరు బాగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు తాజాగా ఆయనపై ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ బహిరంగంగా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి!

రోహిత్ ఏం అన్నాడంటే?
రీసెంట్ గా లక్నో - ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగగా.. అందులో రిషభ్ పంత్ సేన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ ఛేదనలో ముంబయి జట్టులో 191/5 స్కోరుకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో శార్దూల్ ఠాకూర్ కీలకంగా వ్యవహరించి లక్నో విజయంలో కీలకంగా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్ బరిలోకి దిగని రోహిత్ శర్మ.. మైదానంలో ఉత్సాహంగా కనిపించాడు. మ్యాచ్ ముగిశాక.. లక్నో యజమాని సంజీవ్ గోయెంకాతో సరదాగా సంభాషించాడు. అప్పుడే శార్దూల్ ఠాకూర్ తమ వద్దకు వస్తుండగా.. రోహిత్ జోయెల్ గా స్పందించాడు. రోహిత్ మాట్లాడుతూ.. "సర్ ఎందుకు ఆందోళన.. మీకు లార్డ్‌ ఉన్నాడు" అని అన్నాడు. ఈ సంభాషణ కాస్త వైరల్ గా మారింది. మ్యాచులో ఓటమి చెందినా, ఆటగాళ్లు ప్రదర్శన సరిగ్గా లేకపోయినా... ప్లేయర్స్ ను మందలించే గోయెంకాను ఆటపట్టించడానికే రోహిత్ అలా అన్నాడని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, శార్దూల్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచుల్లో 7 వికెట్లు పడగొట్టాడు.

IPL 2025 Rohit Sharma Sanjiv Goenka Ineraction video viral After MI vs LSG Match
Photo Credit: twitter screenshot

జట్టు కోసం బయట నుంచే..
ఈ మ్యాచులో రోహిత్ శర్మ ఆడలేదు. కానీ అతడు మాత్రం తన జట్టు కోసం బయట నుంచే సలహాలు, సూచనలు చేశాడు. తొలి టైమ్‌ఔట్ సమయంలో అతడు మైదానంలోకి వచ్చి స్లో బంతులను సంధించాలని తమ జట్టు బౌలర్లకు అడ్వైస్ ఇచ్చాడు. దీన్ని పాటించిన హార్దిక్ పాండ్య.. పాంచ్ పటాఖా ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగి.. ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్ గా నిలిచాడు.

Story first published: Sunday, April 6, 2025, 11:50 [IST]
Other articles published on Apr 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+