Mumbai indians: ప్రమాదంలో రోహిత్ శర్మ..!
IPL 2025: ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. అతడు మళ్లీ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులోనూ ప్రభావం చూపలేకపోయాడు. 8 పరుగులే చేసి బౌల్డయ్యాడు. అలా గత రెండు మ్యాచుల్లోనూ రోహిత్ విఫలమైన నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ తుది జట్టులో అతడి స్థానంపై ప్రశ్నలు మొదలయ్యాయి. ప్లేయింగ్ 11లో అతడికి చోటు కల్పించాలా లేదా జట్టుకు మార్పు అవసరమా అంటూ పలువురు క్రికెట్ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.
14 మ్యాచుల్లో ఒక్కసారి మాత్రమే..
వాస్తవానికి ముంబయి ఇండియన్స్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు రోహిత్ శర్మనే. అతడే ఆ జట్టుకు మెయిన్ ఫేస్. ఒకప్పుడు నిలకడ ప్రదర్శనతో భారీగా పరుగులు చేస్తూ, జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. కెప్టెన్ గానూ జట్టుకు ఐదు టైటిళ్లు అందించిన ఘనత అతడిది. కానీ ఇప్పుడతడు గత కొన్నిసీజన్లుగా బ్యాటుతో అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఐపీఎల్ 2025 అతడి పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో 0,8 పరుగులు చేసి తీవ్రంగా నిరశపరిచాడు. పైగా ఈ రెండు మ్యాచుల్లో ముంబయి కూడా పరాజయాలను అందుకుంది.
అయితే రోహిత్ ఇలా పేలవ ప్రదర్శనతో కిందకు పడిపోవడం ఒక్క రాత్రిలో జరిగిందేది కాదు. లీగ్ లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచినప్పడికీ, గత కొద్ది సీజన్లుగా అతడి ఆటతీరులో స్థిరమైన తగ్గుదల కనిపిస్తోంది. ఐపీఎల్ 2024లో అతడు సెంచరీ చేయడంతో పాటు గతం కన్నా మెరుగైన స్ట్రైక్ రేట్ తో ఆడాడు. కానీ అతడి మొత్తం గణాంకాలు పరిశీలిస్తేనే అస్థిరత కనిపిస్తోంది. గత 14 మ్యాచుల్లో అతడు కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు.
- 2025: 2 మ్యాచుల్లో*, 8 పరుగులు, 4.00 యావరేజ్, 100.00 స్ట్రైక్ రేట్
- 2024: 14 మ్యాచుల్లో, 417 పరుగులు, 32.08 యావరేజ్, 150.00 స్ట్రైక్ రేట్
- 2023: 16 మ్యాచుల్లో, 332 పరుగులు, 20.75 యావరేజ్, 132.80 స్ట్రైక్ రేట్
- 2022: 14 మ్యాచుల్లో, 268 పరుగులు, 19.14 యావరేజ్, 120.18 స్ట్రైక్ రేట్
- 2021: 13 మ్యాచుల్లో, 381 పరుగులు, 29.30 యావరేజ్, 127.42 స్ట్రైక్ రేట్

తుది జట్టులో రోహిత్ కు చోటు?
ఇతర బ్యాటర్లు అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న వేళ, రోహిత్ నిలకడలేని ప్రదర్శనతో అతడిని టాప్ ఆర్డర్ లో పంపించడం సహా తుది జట్టులో అతడి స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జట్టులో అతడి స్థానం ప్రమాదంలో పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఇప్పటికే అతడు 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అతడి ఐపీఎల్ భవిష్యత్ పై కూడా కాస్త అనుమానాలు తలెత్తుతున్నాయి. కాబట్టి రాబోయే మ్యాచుల్లో రోహిత్ మెరుగైన ప్రదర్శన చేస్తేనే, ఆ తర్వాత మ్యాచుల్లో ముంబయి తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అలా జరగదు..!
అయితే ఎటువంటి అభిప్రాయాలు వినిపిస్తన్నప్పటికీ రోహిత్ ను తక్కువ అంచనా వేయలేం. ఒక్కసారి అతడు క్రీజులో నిలదొక్కుకున్నాడంటే భారీ ఇన్నింగ్స్ ఆడతాడు. పైగా ముంబయి జట్టుకు అతడే మెయిన్ ఫేస్. కాబట్టి ముంబయి అతడిని పక్కనపెట్టే సాహసం చేయకపోవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications