రీసెంట్‌గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐపీఎల్ 2025కు ముందు రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. తన కూతురు సమైరాతో కలిసి చిన్నపిల్లడిలా మారి ఆటలాడుతూ సరదాగా గడిపాడు. ఐపీఎల్ హీట్‌కు ముందు బాడీ, మైండ్‌ని కూల్ చేసుకున్నాడు. అయితే తాజాగా రోహిత్ శర్మ మాల్దీవుల్లో ఒక్క రాత్రికి ఎంత ఖర్చు పెట్టాడో వివరాలు బయటకొచ్చాయి!
రోహిత్ శర్మ Waldorf Astoria Maldives Ithaafushi అనే లగ్జరీ రిసోర్ట్ లో (ప్రైవేట్ ఐలాండ్) భార్య, పిల్లలతో కలిసి సరదాగా గడిపాడు. ఎంతో విశాలవంతంగా, ప్రశాంత వాతవరణంలో ఉండే ఈ ప్రైవేట్ ఐలాండ్ కపుల్స్ కు చాలా బాగుంటుందట. అక్కడ మొత్తంగా 117 రీఫ్ విల్లా, బీచ్ విల్లా, ఓవర్ వాటర్ విల్లాలు.. అని మూడు రకాల విల్లాలు ఉంటాయి. అది కూడా ప్రైవేట్ పూల్ తో. మాల్దీవల్లోనే అతిపెద్ద లార్జెస్ట్ ఐలాండ్ అది. ఇంటిమేట్ సెలబ్రేషన్స్ కు స్వర్గంలా ఉంటుందని ఇంగ్లీష్ మీడియా కథనాల్లో దీని గురించి రాసి ఉంది.
రోహిత్ ఎక్కడ ఉన్నాడంటే?
వీటిలో రోహిత్ శర్మ రీఫ్ విల్లాలో సేవ తీరాడు. అక్కడ బైక్, సైకిల్ రైడింగ్ చేస్తూ, అక్వాటిక్ అడ్వెంచర్స్ చేస్తూ చిల్ కొట్టాడు. అయితే ఈ విల్లాలో ఒక్క రాత్రికి చెల్లించాల్సిన ధర కళ్లు చెదిరేలా ఉంది. ఈ రిసోర్ట్ అఫీషియల్ వెబ్ సైట్ ప్రకారం.. త్రీ బెడ్ రూమ్ ఉన్న గ్రాండ్ బీచ్ విల్లా రూ.22.81 లక్షలు, త్రీ బెడ్ రూమ్ ఓవర్ వాటర్ విల్లా రూ.15.66 లక్షలు, రెండు బెడ్ రూమ్ లు ఉండే రీఫ్ విల్లా రూ.6.5 లక్షలు అని రాసి ఉంది.
తిరిగొచ్చేసిన రోహిత్..
మాల్దీవుల్లో ఎంజాయ్ చేశాక రోహిత్ శర్మ తిరిగి ఐపీఎల్ గూటికి చేరాడు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్రధాన ఆటగాళ్లంతా ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. రోహిత్ శర్మ కూడా కొద్ది రోజులు కుటుంబానికి సమయాన్ని కేటాయించి ఇప్పుడు ముంబైకి చేరుకున్నాడు.
