CSK VS MI: ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఓపెనింగ్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగనుంది. ఆ తర్వాత మార్చిన 23న హైదరాబాద్ వేదికగా SRH vs RR, చెన్నైలో MI vs CSK మ్యాచ్ జరగనుంది. అయితే వీటిలో మిగతా మ్యాచులతో పోలిస్తే ముంబయి వర్సెస్ సీఎస్కే మ్యాచ్ కు ఉన్న క్రేజ్.. భారీ స్థాయిలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. ఈ సందర్భంలో రోహిత్ శర్మ.. సీఎస్కేపై కోపంతో గాజు గ్లాసును పగులగొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
మ్యాచులు ప్రారంభానికి ముందు బ్రాడ్‌కాస్టర్స్.. క్రికెట్ ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచేందుకు సరికొత్త ప్రోమోలు కూడా విడుదల చేస్తున్నారు. అలా తాజాగా సీఎస్కే - ముంబయి ఇండియన్స్ మ్యాచ్ కు సంబంధించి ఓ సూపర్ ప్రోమో విడుదలై క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ఫన్నీ ప్రోమోలో రోహిత్ శర్మ - హార్దిక్ పాండ్య కనిపించి ఫన్ క్రియేట్ చేశారు. మన మొదటి మ్యాచ్ ఎప్పుడు అని రోహిత్ అడగగా.. హార్దిక్ వెయిటర్ ను పిలిచి, అనంతరం సండే, సీఎస్కేతో ఉందని చెబుతాడు. దానికి వెంటనే రోహిత్ కోపంతో తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ ను పగులగొట్టేస్తాడు. ఆ వెంటనే హార్దిక్, వెయిటర్ దీన్ని క్లీన్ చేయ్ అంటూ ప్రోమోను ముగించారు. ఇది క్రికెట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. మీరు దాన్ని చూసేయండి..
హాట్ కేకుల్లా టికెట్లు...
సీఎస్కే - ముంబయి మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయగా అవి హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అంతకుముందే ఈ టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరలకు విక్రయిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఓ పాపులర్ రీసేల్ ప్లాట్ ఫామ్ వయాగోగోలో సీఎస్కేకు సంబంధించిన అన్ని మ్యాచుల టికెట్లను రూ.17,804 నుంచి రూ.1.24 లక్షల మధ్య రేంజ్ లో అమ్ముతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
