Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఒకే ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించిన హిట్ మ్యాన్

Rohit Sharma Player of the Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రతి సీజన్‌లో చాలా మంది ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో ముఖ్యాంశాలలో నిలుస్తారు. కానీ తమ అద్భుతమైన ప్రదర్శనతో జట్టును పదే పదే విజయాల వైపు నడిపించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' టైటిల్‌ను గెలుచుకున్నకొంత మంది లెజెండ్‌లు ఉన్నారు. శుక్రవారం గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ 51 బంతుల్లో 81 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి తన జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ విజయం సాధించడంతో రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో ప్రత్యేక జాబితాలో రోహిత్ శర్మ చోటు సంపాదించాడు.

రికార్డు సాధించిన రోహిత్ శర్మ
ఐపీఎల్ కెరీర్‌లో రోహిత్ శర్మకు ఇది 21వ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు. ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు ఈ అవార్డును గెలుచుకున్న మూడో ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ ఇప్పటికీ యాక్టివ్ ప్లేయర్‌గా ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరగవచ్చు. ఈ జాబితాలో అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. ఏబీడీ 25 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఐపీఎల్‌లో చాలా సార్లు ఒంటరిగా మ్యాచ్‌లను గెలిపించాడు. తన జట్టును విజయపథంలో నడిపించాడు. 25 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకోవడంలో ద్వారా తాను టీ20 ఫార్మాట్‌లో కిరీటం లేని రాజు అని నిరూపించుకున్నాడు.

IPL 2025 Rohit Sharma Creates History with 21st Player of the Match Award

రెండో స్థానంలో 'యూనివర్స్ బాస్'
వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఈ జాబితా 22 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలిచి రెండోస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో తుఫాను ఇన్నింగ్స్‌ను ఎవరూ మరచిపోలేరు. ఇందులో 175 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్ కూడా ఉంది. ఇది ఇప్పటికీ ఈ లీగ్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్‌గా నిలిచింది. గేల్ ఐపీఎల్‌లోనే కాకుండా ప్రపంచంలోని ప్రతి టీ20 లీగ్‌లోనూ పెద్ద ఆటగాడిగా ఎదిగాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి జట్ల తరపున ఆడుతున్నప్పుడు గేల్ చాలా సార్లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు.

Story first published: Saturday, May 31, 2025, 11:46 [IST]
Other articles published on May 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+