Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK VS RR: సారా అలీ ఖాన్ - రియాన్ పరాగ్.. ఆ వీడియోలు రచ్చ రచ్చ!!

ఐపీఎల్ 2025లో భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గుహావతి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఇప్పుడీ మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తో పాటు బాలీవుడ్ అందాల భామ సారా అలీఖాన్ ను టీజ్‌తో పాటు తెగ ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. ఇద్దరినీ సరదాగా ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

ఎందుకంటే?
ఐపీఎల్ 2024 తర్వాత రియాన్ పరాగ్ తన బ్యాటింగ్ రికార్డ్స్‌తో పాటు యూట్యూబ్ సెర్చ్ హిస్టరీతో సోషల్ మీడియా లో వైరల్‌గా అయిపోయాడు. 2024 సీజన్ ముగియగానే అతడు తన యూట్యూబ్ ఓపెన్ చేసి అనన్య పాండే, సారా అలీఖాన్ వీడియోలు సెర్చ్ చేసినట్లు స్క్రీన్ షాట్లు అప్పట్లో తెగ ట్రెండ్ అయ్యాయి. రియాన్ పరాగ్ బాగా స్కోర్లు సాధించడానికి ఇదే కారణమంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి. మరికొంతమంది అయితే ఏకంగా రియాన్.. సారాఅలీఖాన్, అనన్య పాండే ప్రైవేట్ వీడియోలు కూడా చేశారని అతిగా కామెంట్లు కూడా చేశారు.

IPL 2025 Riyan Parag Sara Ali Khan trolled after confirmed to dance in Guwahati before RR vs CSK

రియాన్ పరాగ్ ముందు డ్యాన్స్...
అయితే ఇప్పుడు సీఎస్కేతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు రియాన్ పరాగ్. ఈ మ్యాచ్ కోసం ఆరంభ వేడుకల్లో భాగంగా సారా అలీఖానే డ్యాన్స్ వేయనుండటం విశేషం. మ్యాచ్ నిర్వాహకులు ఆమెనే ఎంపిక చేశారు. అందుకే ఇప్పుడు మరోసారి రియాన్ పరాగ్ ను ట్రోల్ చేయడం ప్రారంభించారు అభిమానులు. ఇదే సమయంలో ఎవరైతే తన కోసం వెతికాడో.. ఇప్పుడు అతడి ముందే డ్యాన్స్ వేయనుండడంతో సారాను కూడా టీజ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అందుకే ఈ ఇద్దరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్నారు. అందరూ వీళ్ల గురించే మాట్లాడుకుంటున్నారు.

ఎందుకలా చేశారో నాకైతే తెలీదు..
గత నెలలో ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐపీఎల్ 2024 సమయంలో జరిగిన విషయంపై స్పష్టత ఇచ్చేందుకు ట్రై చేశాడు రియాన్ పరాగ్. ఐపీఎల్ ముగిసిన తర్వాత తన దగ్గర స్పాటిఫై, యాపిల్ మ్యూజిక్స్ ఏమీ లేకపోవడంతో, యూట్యూబ్‌లో సాంగ్స్ సెర్చ్ చేసినట్లు తెలిపాడు. ఆ మాత్రం దానికే అంతా రచ్చ చేశారని, అసలు ఎందుకు అంత చేశారో తనకు అర్థం కాలేదని చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, March 30, 2025, 15:01 [IST]
Other articles published on Mar 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+