Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: రిషభ్ పంత్‌పై కాసుల వర్షం.. ఐపీఎల్ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు ధర

ఐపీఎల్ మెగా వేలం అంచనాలకు మించి సాగుతోంది. ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు రూ.కోట్లు కుమ్మరిస్తున్నాయి. మైదానంలో ప్రత్యర్థి జట్లు హోరాహోరా పోటీకి దీటుగా ఫ్రాంచైజీ యజమానులు తలపడుతున్నారు. ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్దు ధర పలికిన ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించిన పది నిమిషాలకే రిషభ్ పంత్ నయా చరిత్ర లిఖించాడు.

మెగా వేలంలో రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌ రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే వేలంలో తొలుత పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ.20.75 కోట్లు వెచ్చించడానికే సిద్ధమైంది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ తమ మాజీ కెప్టెన్‌న తిరిగి తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించడానికి ఆర్‌టీఎమ్ కార్డ్‌ను ఉపయోగించింది. కానీ ఢిల్లీ పంత్ కోసం సాహిసించలేని మొత్తాన్ని లక్నో బిడ్ వేసింది.

IPL 2025 Rishabh Pant Becomes Highest Bid Player in IPL History at 27 Crores

యాజమాన్యంతో విభేదాల కారణాంగా రిషభ్ పంత్ వేలంలోకి వచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఢిల్లీ పంత్ కోసం తిరిగి ప్రయత్నించడం గమనార్హం. అయితే లక్నో పర్స్ వ్యాల్యూను తగ్గించడం కోసం లక్నో ఆర్థిక వ్యూహాలతో ఆర్‌టీఎమ్ కార్డు ఉపయోగించనట్లు తెలుస్తోంది. కాగా, శ్రేయస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. గతంలో ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డు ధర మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు- కేకేఆర్) ఉండేది.

IPL 2025 మెగా వేలం హైలైట్స్

అర్ష్‌దీప్ సింగ్-రూ. 18 కోట్లు(పంజాబ్ కింగ్స్-ఆర్‌టీఎమ్)

కగిసో రబడా-రూ. 10.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)

శ్రేయస్ అయ్యర్-రూ. 26.75 కోట్లు(పంజాబ్ కింగ్స్)

జోస్ బట్లర్-రూ.15.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)

మిచెల్ స్టార్క్-రూ.11.75 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)

రిషభ్ పంత్‌- రూ.27 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)

Story first published: Sunday, November 24, 2024, 16:54 [IST]
Other articles published on Nov 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+