IPL 2025 : లఖ్‌నవూ కెప్టెన్ గా పంత్- అఫీషియల్ అనౌన్స్ మెంట్!
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ విషయంలో ఊహించినట్టుగానే జరిగింది. టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ లఖ్‌నవూ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అతడిని జట్టు సారథిగా నియమించినట్లు ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా అధికారికంగా ఖరారు చేశారు. పంత్ తో పాటు కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజీవ్ గోయెంకా ఈ ప్రకటన చేశారు. భవిష్యత్ లో పంత్ ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్ గా ఎదుగుతాడని సంజీవ్ ధీమా వ్యక్తం చేశారు.
కాగా, ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ (రూ.27 కోట్లు) మెగా లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో పంత్ కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం మొదటి నుంచి క్రికెట్ వర్గాల్లో ప్రచారం సాగింది. ఇప్పుడు దాన్నే నిజం చేస్తూ అఫీషియల్ గా ప్రకటించారు.

ఇక పంత్ కన్నా ముందు లఖ్‌నవూ జట్టుకు కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్య, నికోలస్ పూరన్ కెప్టెన్ గా వ్యవహరించారు. కాగా, 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పంత్... అప్పటి నుంచి దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. 110 మ్యాచులు ఆడి 35.31 సగటుతో 3,284 రన్స్ సాధించాడు. అందులో ఓ శతకం, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021లో కెప్టెన్ గానూ సెలెక్ట్ అయ్యాడు. అదే సీజన్ లో తన జట్టును ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. 2022, 2024 సీజన్ లోనూ సారథిగా వ్యవహరించాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2025 మెగా వేలంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పంత్ ను అత్యధిక ధరకు సొంతం చేసుకుంది.
లఖ్‌నవూ జట్టు ఐపీఎల్ 2025 వేలానికి ముందు నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్నోయ్ తో పాటు అన్ క్యాప్డ్ స్టార్స్ మోషిన్ ఖాన్, ఆయుష్ బదోనీని రిటైన్ చేసుకుంది. గత సీజన్ లో 14 మ్యాచుల్లో ఏడింటిలో విజయం సాధించి 14 పాయింట్లతో ఏడో స్థానంలో సరిపెట్టుకుంది.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు ఇదే :
బ్యాటర్స్ : మర్ క్రమ్, డేవిడ్ మిల్లర్, ఆయుశ్ బడోని (రిటైన్), హిమ్మత్ సింగ్, మాథ్యూ బ్రీట్జ్కే.
వికెట్ కీపర్లు: రిషబ్ పంత్, నికోలస్ పూరన్ (రిటైన్), ఆర్యన్ జుయల్.
ఆల్ రౌండర్లు: అబ్దుల్ సమద్ (స్పిన్), మిచెల్ మార్ష్ (పేస్), షాబాజ్ అహ్మద్ (స్పిన్), యువరాజ్ చౌదరి (స్పిన్), రాజవర్ధన్ హంగర్గేకర్ (పేస్), అర్షిన్ కులకర్ణి (పేస్).
స్పిన్నర్లు: రవి బిష్ణోయ్ (రిటైన్), ఎం సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్.
ఫాస్ట్ బౌలర్లు: మయాంక్ యాదవ్ (రిటైన్), మొహ్సిన్ ఖాన్ (రిటైన్), ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, ఆకాష్ సింగ్, షమర్ జోసెఫ్, ప్రిన్స్ యాదవ్.
Sanjeev Goenka said - “Rishabh Pant is going to be The best Captain ever in IPL history in future”. pic.twitter.com/KGd4eDF5QO
— Tanuj Singh (@ImTanujSingh) January 20, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications