IPL 2025: రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిన కుర్రాళ్లు.. పూర్తి జాబితా ఇదే!
ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిటెన్షన్ ప్లేయర్ల జాబితా గురువారం విడుదలైంది. ఆటగాళ్ల సామర్థ్యాన్ని అంచనా వేస్తూ, ఆర్థిక వ్యూహాలతో పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించింది. ఊహించినట్లుగానే కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా ఆరుగురు ప్లేయర్లను, పంజాబ్ కింగ్స్ అత్యల్పంగా ఇద్దరిని మాత్రమే అట్టిపెట్టుకుంది. ఎంఎస్ ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా సీఎస్కేలో కొనసాగనున్నాడు.
ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మినహా మిగిలిన ఫ్రాంచైజీలన్ని అన్‌క్యాప్డ్ ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. అయితే కొందరు కుర్రాళ్లు భారీగా రిటైన్ ధర సొంతం చేసుకున్నారు. గతంలో రూ.లక్షల జీతంతో ఆయా ఫ్రాంచైజీల్లో అడుగుపెట్టిన యంగ్ గన్స్ ఈసారి రూ. కోట్లు దక్కించకున్నారు. ఈ జాబితాలో టాప్‌లో ధ్రువ్ జురెల్ ఉన్నాడు. 2022లో ధ్రువ్‌ను రూ.20 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.

ఆ తర్వాత ఐపీఎల్, దేశవాళీలో సత్తాచాటుతూ క్రమంగా ధ్రువ్ జురెల్ టీమిండియాలో కూడా అడుగుపెట్టాడు. అయితే ఈ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కోసం ఈసారి రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ.14 కోట్లు రిటైన్ ధర వెచ్చించింది. ఇక 2022 సీజన్‌లో రూ.55 లక్షలతో కేకేఆర్ ఫ్రాంచైజీలోకి వచ్చిన రింకూ సింగ్‌పై కూడా కాసుల వర్షం కురిసింది. ఫినిషర్ రింకూను కేకేఆర్ రూ.13 కోట్లకు రిటైన్ చేసుకున్నాయి. ఇలా గతంలో తక్కువ మొత్తానికి కొనుగోలు అయ్యి ఇప్పుడు రూ.కోట్లు సాధించిన ఆటగాళ్ల పూర్తి జాబితా మీ కోసం....
ధ్రువ్ జురెల్ (రాజస్థాన్ ): రూ. 14 కోట్లు (2022- రూ. 20 లక్షలు)
రింకూ సింగ్ (కేకేఆర్): రూ. 13 కోట్లు (2022 - రూ. 55 లక్షలు)
మయాంక్ యాదవ్ (లక్నో): రూ. 11 కోట్లు (2023- రూ. 20 లక్షలు)
రజత్ పటిదార్ (ఆర్సీబీ): రూ. 11 కోట్లు (2021- రూ. 20 లక్షలు)
ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ) : రూ. 10 కోట్లు (2024- రూ. 50 లక్షలు)
సాయి సుదర్శన్ (గుజరాత్): రూ. 8.5 కోట్లు (2022- రూ. 20 లక్షలు)
నితీశ్ రెడ్డి (ఎస్‌ఆర్‌హెచ్): రూ. 6 కోట్లు (2023- రూ. 20 లక్షలు)
శశాంక్ సింగ్ (పంజాబ్): రూ. 5.5 కోట్లు (2024- రూ.20 లక్షలు).
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications