For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: ధోనీ తరహాలోనే ఈ అనుభవజ్ఞులకు రూ.4 కోట్లే.. SRHలోనూ ఒక్కరు!

ఐపీఎల్ మెగా వేలం-2025కు సంబంధించిన నిబంధనలు, రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ఇటీవల ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆర్‌టీఎమ్‌ను ఉపయోగించుకుంటూ ఆరుగురు ప్లేయర్ల వరకు రిటైన్ చేసుకునే వెసులు బాటు ఫ్రాంచైజీలకు కల్పించింది. అయితే ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది.

అలాగే రిటెన్షన్ పాలసీ ధరను కూడా నిర్ణయించింది. అయిదుగురును రిటైన్ చేసుకుంటే ఫ్రాంచైజీ రూ.45 కోట్లను తన పర్స్ వ్యాల్యూ నుంచి కోల్పోవాల్సి ఉంటుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ రిటెన్షన్ ధర రూ. 4 కోట్లుగా నిర్ణయించింది. అయితే రిటైర్మెంట్ తీసుకుని అయిదేళ్గు గడిచిన ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్ పరిగణిస్తూ గత నిబంధనను తిరిగి బీసీసీఐ అమలు చేసింది.

IPL 2025 Retentions 8 Indian Cricketers Who Could Be Retained Like MS Dhoni in the Uncapped Category

''ఓ భారత ప్లేయర్ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఇలా పరిగణిస్తారు. గత అయిదేళ్ల క్యాలెండ్ ఇయర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లో అయినా తుదిజట్టులో కూడా చోటు దక్కించుకోని ఆటగాళ్లు, అలాగే ఆ సదరు ప్లేయర్లు బీసీసీఐతో సెంట్రల్ కాంట్రక్ట్ కూడా లేకుండా ఉంటే అన్‌క్యాప్డ్‌‌గా పరిగణిస్తారు. ఇది భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది'' అని బీసీసీఐ నిబంధన వెల్లడించింది.

ఈ నిబంధన కేవలం ఎంఎస్ ధోనీకి మాత్రమే వర్తిస్తుందని కొందరు అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ రూల్‌తో దాదాపు ఎనిమిది మంది అనుభవజ్ఞులను ఆయా ఫ్రాంచైజీలు రూ.4 కోట్లకే రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. వాళ్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే కూడా ఉన్నాడు. మార్కండే 2019లోనే భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ఆడాడు. ఆ తర్వాత టీమిండియాలో అతనికి మరో ఛాన్స్ లేదు. బీసీసీఐ నయా రూల్‌తో మార్కండే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా మారాడు.

సందీప్ శర్మ (రాజస్థాన్ రాయల్స్)
మోహిత్ శర్మ (గుజరాత్ టైటాన్స్)
పీయూష్ చావ్లా (ముంబై ఇండియన్స్)
విజయ్ శంకర్ (గుజరాత్ టైటాన్స్)

అమిత్ మిశ్రా (లక్నో సూపర్ జెయింట్స్)
రిషి ధావన్ (పంజాబ్ కింగ్స్)
మయాంక్ మార్కండే (సన్‌రైజర్స్ హైదరాబాద్)
కర్ణ్ శర్మ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు).

Story first published: Sunday, October 13, 2024, 10:14 [IST]
Other articles published on Oct 13, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+