IPL 2025 Retention LIVE: వేలంలోకి ముగ్గురు కెప్టెన్లు!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రిటెన్షన్ జాబితా ప్రకటనకు రంగం సిద్ధమైంది. తమ రిటైన్డ్ ప్లేయర్ జాబితా ప్రకటించడానికి ఫ్రాంచైజీలకి బీసీసీఐ ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. మరికాసేపట్లో పది ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ అధికారికంగా వెల్లడించనున్నారు. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్.
ఆరుగురిని నేరుగా రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్‌తో వేలంలో సొంతం చేసుకోవచ్చు. ఇందులో విదేశీ ప్లేయర్లకు ఎలాంటి పరిమితి లేదు. అంటే మొత్తం అయిదుగురు ఫారెన్ ప్లేయర్లను (క్యాప్డ్ ప్లేయర్ల రూల్‌తో) కూడా అట్టిపెట్టుకోవచ్చు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు ఆయా ఫ్రాంచైజీలు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను అట్టిపెట్టుకుంటే మాత్రం రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications