Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్సీబీ గెలిచింది మంచి ప్రదర్శనతో కాదు..!: సెహ్వాగ్

IPL 2025 RCB: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచులో సీఎస్కేపై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరు.. క్రికెట్ అభిమానులను మునివేళ్లపై కూర్చోపెట్టింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిశాక మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..

ఈ మ్యాచ్ గురించి స్పందించాడు. ఈ థ్రిల్లింగ్ పోరును తాను బాగా ఆస్వాదించినట్లు పేర్కొన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట 213 పరుగులు చేస్తుందని తాను అనుకోలేదని అన్నాడు సెహ్వాగ్. కానీ అనూహ్యంగా ఓ దశలో కేవలం రెండు ఓవర్లో 55 పరుగులు పిండుకుని, నిర్ణీత 20 ఓవర్లలో 213/5 చేయడం ఆశ్యర్యమేసిందని చెప్పాడు.

IPL 2025 RCB won by luck against csk says virendra sehwag

ఒక్క బౌండరీ లేదా సిక్స్..
సీఎస్కేకు ఆర్సీబీపై గెలిచే గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని, చివరి మూడు బంతుల్లో ఒక్క బిగ్ హిట్ పడినా మ్యాచ్ వాళ్లవైపు తిరిగేదని అన్నాడు. కానీ యశ్ దయాశ్ కట్టుదిట్టమైన బౌలింగ్ వల్ల సీఎస్కే ఆ అవకాశాన్ని చేజార్చుకుందని చెప్పుకొచ్చాడు. తీవ్ర ఒత్తిడిలోనూ యశ్ దయాళ్ బౌలింగ్ అద్భుతంగా వేయడంపై ప్రశంసలు కురిపించాడు. చివర్లో ధోనీ ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపడం, జడేజా, శివమ్ దూబెను అద్భుతంగా కట్టడి చేశాడు యశ్. వాళ్లు ఒక్క బౌండరీ లేదా సిక్స్ బాది ఉంటే విజయం సీఎస్కేకు దక్కేదని అభిప్రాయపడ్డాడు.

"వాళ్లకు చివరి మూడు బంతుల్లో ఒక్క పెద్ద హిట్ రావాల్సింది. అప్పుడు చెన్నై గెలిచేది. కానీ వాళ్లు సింగిల్ హిట్ కూడా ఇవ్వలేకపోయారు. యశ్ దయాల్ అద్భుతం చేశాడు. గతేడాది ధోనీ ముందు ఇదే చేశాడు. ఈ సారి కేవలం ధోనీ ముందు మాత్రమే కాదు, జడేజా, దూబె ముందు ఇదే ప్రదర్శన చేశాడు. ఎంతో ఫన్నీగా ఉంది. ఆటను బాగా ఆస్వాదించాను." అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

అదృష్టం ఆర్సీబీ వైపు నిలబడింది..
రాయల్ ఛాలెంజర్స్ అదృష్టం కొద్ది ఓటమి నుంచి తప్పించుకుందని, లేదంటే పరాజయం చెందేదని అన్నాడు సెహ్వాగ్. "ఆర్సీబీ కొద్దిలో ఓటమి నుంచి తప్పించుకుంది. లక్ ఆర్సీబీ వైపు నిలబడింది. వాస్తవానికి ఇలాంటి మ్యాచుల్లో 90 శాతం బ్యాటింగ్ జట్లు గెలుస్తాయి. జడ్డూ లాస్ట్ ఓవర్ లో ఒక్క సింగిల్ కూడా తీయలేదు. ఆర్సీబీ ఎంతైనా లక్కీ." అని చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ ఎలాగైనా ఈ 18వ సీజన్ లో టైటిల్ గెలవాలని, ప్రపంచమొత్తం మద్దతుగా నిలుస్తోందని, డెస్టినీ ఆర్సీబీకి ఫేవర్ గా ఉంటూ విజయం వైపు నడిపిస్తోందని అన్నాడు.

Story first published: Sunday, May 4, 2025, 16:43 [IST]
Other articles published on May 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+