Virat Kohli: ఫ్రెండ్ అయినా - పగోడైనా అస్సలు వదలడు!!
RCB VS DC: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై కేఎల్ రాహుల్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ బరిలో ఉన్నంత వరకు ప్రత్యర్థి జట్లు ఒత్తిడిలోనే ఉంటాయని అన్నాడు. అతడి ఆత్మవిశ్వాసం, ఫోకస్, టీమ్‌పై అతడు చూపే ప్రభావం అద్భుతమని పేర్కొన్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ దిల్లీ క్యాపిటల్స్ పోరుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'కోహ్లీతో కలిసి ఆడటం లేదా కోహ్లీపై ఆడటంలో తేడా ఎలా ఉంటుంది?' అని యాంకర్ అడగగా.. ఈ కామెంట్స్ చేశాడు. మరిన్ని ఆసక్తికర విషయాలు కూడా చెప్పాడు.

మనల్ని అక్కడికి తీసుకెళ్తాడు..
"ఎక్కువగా పెద్ద తేడా ఏమీ ఉండడు. గెలిచినా ఓడినా.. అతనెప్పుడు ఒకేలా ఉంటాడు. అదే కసి, అదే ప్యాషన్ తో ఆడుతాడు. ఎప్పుడూ గెలవాలన్న కసితో, పోటీతత్వంతో ఆడతాడు. విరాట్ తో కలిసి ఆడితే అతడు ఎంత దూకుడుగా, కసిగా ఆడతాడో అర్థమవుతుంది. మనల్ని కూడా తన స్థాయికి తగ్గట్లు తీసుకెళ్తాడు. అతడు ప్రత్యర్థి జట్లపై చూపించే పవర్ అసాధారణం."
"అతడి స్థాయిలోనే జట్టులోని ఆటగాళ్లంతా ఆడేలా ప్రేరేపించగలడు. మైదనం లోపల ఎంత ఫ్రెండ్ అయినా సరే, అతడు ప్రత్యర్థిగా ఆడుతున్నప్పుడు చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. కోహ్లీ ప్రపంచ స్థాయి ఆటగాడు. విరాట్.. ఏ పరిస్థితిలోనైనా మ్యాచ్ గెలిపించగలడు. అతడు క్రీజ్‌లో ఉన్నంత వరకూ ఆట ముగియదు. ప్రత్యర్థి జట్టు ఒత్తిడిలోనే ఉంటుంది. కోహ్లీని ఎదుర్కోవడం అంత సులభం కాదు. అతడితో పోటీపడటం ఎంతో కష్టం." అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications