IPL 2025 RCB VS CSK: ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యమా స్పీడులో ఉన్నాడు. ఆడిన 10 మ్యాచుల్లో 443 చేసి ఫుల్ జోషల్ ఉన్నాడు. అలాగే విరాట్ ప్రాతినిధ్యం వహిస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఈ సారి అదిరే ప్రదర్శన చేస్తూ ప్లే ఆఫ్స్ రేసులో ముందుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. తన నెక్ట్స్ మ్యాచును హోమ్ గ్రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంఛైజీలు, బ్రాడ్ కాస్టర్స్.. ఆటగాళ్లకు సంబంధించిన ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
సినీ తారలు ఏం అన్నారంటే
Dhoni VS Kohli: ఈ క్రమంలోనే ధోనీ వర్సెస్ కోహ్లీ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో సినీ తారలు.. ఈ ఇద్దరు బడా క్రికెటర్స్ లో తమకు ఎవరు ఇష్టమో, ఎందుకు ఇష్టమో వివరిస్తూ కనిపించారు. ముందుగా హీరోయిన్ సమంత ధోనీ, సీఎస్కే టీమ్ అంతే చాలా ఇష్టమని పేర్కొంది. ఆ తర్వాత కోహ్లీ స్వాగ్ అంటే ఇష్టం. అతడికి పెద్ద అభిమానిని అని ముద్దుగమ్మ సారా అలీఖాన్ చెప్పింది. అనంతరం సీనియర్ హీరోయిన్ కత్రినా కైఫ్, యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ధోనీ పేరు చెప్పగా.. నేషనల్ క్రష్ ట్యాగ్ తగలించుకున్న రష్మిక... కోహ్లీ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. హీరో విక్కీ కౌశల్ ధోనీకి ఓటు వేయగా.. సీనియర్ నటుడు సునీల్ శెట్టి కోహ్లీ సూపర్ క్రికెట్ ఆడుతాడంటూ ప్రశంసలు కురిపించారు. సల్మాన్ ఖాన్ ధోనీ భాయ్ కు ఫ్యాన్ అని చెప్పారు. ధావన్ కోహ్లీ పేరు చెప్పాడు. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ధోనీ వైపు నిలబడగా.. విరాట్ స్టైల్ బాగుంటుందని విజయ్ దేవరకొండ చెప్పాడు.

నేను కోహ్లీ ఫ్యాన్..
సీనియర్ హీరోయన్ ఐశ్వర్య రాయ్ కూడా విరాట్ కోహ్లీ గ్రేట్ నెస్ గురించి వివరించింది. "నేను విరాట్ ఫ్యాన్ ని. అతడు అగ్రిస్సివ్ క్రికెట్ బాగుంటుంది. అతడికి పిచ్చి పీక్స్ లో ఉంటుంది. కానీ ఎంతో ఫోకస్డ్ గా క్రికెట్ ఆడుతాడు. అతడు సూపర్" అంటూ అందాల భామ ఐశ్వర్య రాయ్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించింది.