For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ భారీ షాక్! - ఆ వీడియోలు తొలిగింపు!!

Virat Kohli: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు బయట కనిపించినా, మైదానంలో బ్యాట్ పట్టినా.. సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టినా.. ఫ్యాన్స్ అతడిపై చూపించే అభిమానం వెలకట్టలేనిది. ముఖ్యంగా అతడి బ్రాండ్ వ్యాల్యూ అయితే ఏ స్థాయిలో ఉంటుందంటే.. బడా కంపెనీలన్నీ అతడి వెంటే పరిగెడుతాయి. అతడితో ప్రచారం చేయించేందుకు పోటీపడుతుంటాయి.

అవన్నీ అందులో లేవ్..
అందుకే విరాట్ కోహ్లీ ఇన్ స్టా ఓపెన్ చేసి చూస్తే.. ఫీడ్‌లో బ్రాండ్ ప్రమోషన్ పోస్టులే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు కోహ్లీ తన రూట్ మార్చాడు. ప్రమోషన్ కంటెంట్‌ను పోస్ట్‌ ఫీడ్‌ నుంచి తొలగించేశాడు. అందుకు కారణం తెలీదు కానీ.. ఇప్పుడతడి ఇన్ స్టా ఓపెన్ చేస్తే... పర్సనల్ లైఫ్ విషయాలే కనిపిస్తున్నాయి. జిమ్‌లో కసరత్తులు చేసిన వీడియోలు, భార్య అనుష్క శర్మతో , ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు, క్రికెట్‌ కు సంబంధించిన విశేషాలు, తన వ్యాపారాలకు సంబంధించిన పోస్టులు మాత్రమే అందులో ఉన్నాయి. ఇది చూసి కొంతమంది ఫ్యాన్స్ షాక్ అవుతుంటే.. మరికొంతమంది సర్పైజ్ అవుతున్నారు. యాడ్స్‌ లేకపోతే చాలా బాగుందని కొందరు కామెంట్లు చేస్తుంటే.. స్పాన్సర్స్‌ డీల్స్‌ను అతడు బ్రేక్‌ చేశాడా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

IPL 2025 RCB Virat Kohli removes all advertisement content from his Instagram Feed

అసలు విషయం ఇదీ..
అయితే, బ్రాండ్ ప్రమోషన్ వీడియోలను కోహ్లీ తొలిగించలేదు. వాటిని 'రీల్స్‌' సెక్షన్‌లోకి మార్చాడు. దీంతో ఆ వీడియోలన్నీ రీల్స్‌ సెక్షన్ లో కనబడుతున్నాయి. కానీ ఇందుకు గల కారణాన్ని కోహ్లీ టీమ్‌ అధికారికంగా చెప్పలేదు. కాగా, కోహ్లీ ఇన్‌స్టా ఖాతాకు 27.1 కోట్ల మంది, ఎక్స్‌ అకౌంట్ కు 6.7 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Story first published: Thursday, April 10, 2025, 9:10 [IST]
Other articles published on Apr 10, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+