Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఆర్సీబీ ఐపీఎల్ గెలిచింది.. మాజీ స్టార్ క్రికెటర్ జోస్యం

IPL 2025: దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ఐపీఎల్ 2025 గురించి షాకింగ్ అంచనా వేశాడు. డేల్ స్టెయిన్ తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు. "మీరు నమ్మగలరా? ఆర్సీబీ ఐపీఎల్ గెలిచింది" అని రాసుకొచ్చాడు. డేల్ స్టెయిన్ అంచనా తర్వాత ఆర్సీబీ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అయితే కొంత మంది డేల్ స్టెయిన్ అంచనా తప్పు అంటూ కామెంట్లు చేశారు.

వాస్తవానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో గొప్ప పునరాగమనం చేసింది. లీగ్ దశను రెండో స్థానంలో ముగించింది. ఆర్సీబీ జట్టు 14 మ్యాచ్‌లలో 9 గెలిచి 9 ఏళ్ల తర్వాత టాప్-2లోకి ప్రవేశించింది. ఆర్సీబీ ఫైనల్‌కు చేరుకున్న తర్వాత దక్షిణాఫ్రికా మాజీ లెజెండ్ డేల్ స్టెయిన్ ఈ కీలక అంచనా వేశాడు. "మీరు నమ్మగలరా? ఆర్సీబీ ఐపీఎల్ గెలిచింది!" అని డేల్ స్టెయిన్ అంచనా వేయడంతో ఆర్సీబీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్ జట్టును ఓడించడం ద్వారా ఆర్సీబీ ఫైనల్‌కు చేరుకున్న సమయంలో డేల్ స్టెయిన్ నుంచి ఈ కీలక ప్రకటన వచ్చింది.

IPL 2025 RCB to Win IPL Dale Steyn s Bold Prediction Shocks Fans

ఆర్సీబీ అభిమానులు చాలా కాలంగా తమ జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్నారు. డేల్ స్టెయిన్ ఈ అంచనా వారి ఆశలను మరింత పెంచింది. డేల్ స్టెయిన్ ఈ అంచనా నిజమవుతుందా లేదా ఈ సారి కూడా ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయం పైనల్ మ్యాచ్ ద్వారా తెలియనుంది. ఇదిలా ఉండగా.. దీనికి ముందు డేల్ స్టెయిన్ చాలా అంచనాలు వేశాడనే సంగతి తెలిసిందే. చివరిసారి డేల్ స్టెయిన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ గురించి ఐపీఎల్‌లో 300 పరుగులు సాధిస్తుందని పేర్కొన్నాడు. కానీ అది తప్పు అని తేలింది. ఇప్పుడు ఆర్సీబీ అభిమానులు తమ జట్టు ఈ ఐపీఎల్ ట్రోఫీని ఎత్తే ఫైనల్ కోసం ఎదురుచూస్తున్నారు.

Story first published: Saturday, May 31, 2025, 13:20 [IST]
Other articles published on May 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+