Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ గురించి ఎంత పెద్ద మాటన్నావ్ సాల్ట్ - తిట్టిపోస్తున్న ఫ్యాన్స్! (వీడియో)

RCB Openers Phil Salt Virat Kohli: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మంచి ప్రదర్శన చేస్తూ ముందుకెళ్తోంది. ఆడిన 10 మ్యాచుల్లో ఏడింటిలో గెలిచింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయితే ఆర్సీబీ ఇంత మంచి ప్రదర్శన చేయడానికి కారణం వాళ్ల ఓపెనర్లు. ఓవైపు విరాట్ కోహ్లీ యాంకర్ పాత్ర చేస్తుండగా, మరోవైపు ఫిల్ సాల్ట్ దూకుడుగా ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా అతడి విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడి విమర్శలకు గురయ్యాడు. కోహ్లీ అభిమానులు అతడిని తెగ ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకీ ఫిల్ సాల్ట్ ఏం అన్నాడంటే?
'ఓ సారి నువ్వు ఐపీఎల్ లో ఫ్రెండ్స్ ఉండరు అని చెప్పావ్ కదా.. మరి నువ్వు ఇప్పుడు విరాట్ తో ఓపెనింగ్ చేస్తున్నావు కదా, మీరు ఫ్రెండ్సా కాదా?'... 'అవును మేం కొలిగ్స్' అని ఫిల్ సాల్ట్ సమాధానమిచ్చాడు. 'అంటే కోహ్లీ ఫ్రెండ్ కాదు, కేవలం కొలిగ్ అని చెబుతున్నావ్ అంతే కదా' అని హోస్ట్ తిరిగి అన్నాడు. ఆ వెంటనే 'నేను ఎవరెవరితో కలిసి క్రికెట్ ఆడానో వాళ్లంతా నా ఫ్రెండ్స్. ఈ ఇంటర్వ్యూలో మీకు ఎక్స్ ట్రా స్టఫ్ ఇవ్వాలనుకోవట్లేదు, అందుకే ఇలా చెప్పాను' అంటూ మళ్లీ తిరిగి సమాధానమిచ్చాడు. అయితే ఫిల్ సాల్ట్ చెప్పిన ఈ సమాధానం కొంతమంది క్రికెట్ అభిమానులకు, కోహ్లీ ఫ్యాన్స్ కు నచ్చలేదు. ఫ్రెండ్ కాదు కేవలం కొలిగ్ అని అంటావా అంటూ విమర్శిస్తున్నారు.

ఇద్దరు అద్భుతంగా..
సాల్ట్ ను మెగా వేలంలో ఆర్సీబీ రూ.11.5 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ సీజన్ లో అతడు మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆడిన 9 ఇన్నింగ్స్ లో 168.30 స్ట్రైక్ రేటుతో 239 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలానే విరాట్ కోహ్లీ కూడా జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఆడిన 10 ఇన్నింగ్స్ లో 63.28 సగటు, 138.87 స్ట్రైక్ రేటుతో 443 పరుగులు చేశాడు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉండగా... నాలుగు ఛేజింగ్ లో వచ్చినవే. ఇంకా ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ టాప్ లో ఉన్నాడు.

IPL 2025 RCB Opener Phil Salt says no friendship with virat kohli only colleagues
Story first published: Wednesday, April 30, 2025, 15:38 [IST]
Other articles published on Apr 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+